Vijay Sethupathi : వాట్ ఏ రికార్డ్.. ఇది ‘మక్కల్ సెల్వన్’ కి మాత్రమే సాధ్యం..!

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటించిన 4 సినిమాలు ఒకే నెలలో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి..

Vijay Sethupathi : వాట్ ఏ రికార్డ్.. ఇది ‘మక్కల్ సెల్వన్’ కి మాత్రమే సాధ్యం..!

Vijay Sethupathi

Updated On : September 1, 2021 / 11:53 AM IST

Vijay Sethupathi: సినిమా ఇండస్ట్రీలో కోవిడ్ వల్ల చాలా మంది స్టార్స్ సినిమా షూట్స్ లేక, రిలీజ్‌లు ఆగిపోయి ఇబ్బంది పడ్డారు. కానీ ఒక్క హీరోకి మాత్రం అసలు కరోనాతో సంబంధం లేకుండా షూటింగ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. షూట్స్ కంప్లీట్ చేసుకుని ఒకేసారి.. ఒకటి కాదు రెండు కాదు.. 4 సినిమాలు ఒకే నెలలో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.

Laabam Annabelle Sethupathi

సౌత్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కోవిడ్ ఉన్నా లేకపోయినా ఒకే స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఈ పాండమిక్ టైమ్‌లో ఒక్క సినిమా రిలీజ్ చెయ్యడమే కష్టమనుకుంటుంటే.. ఈ స్టార్ మాత్రం వరస పెట్టి 4 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఒకే నెలలో. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఓటీటీలో విజయ్ సేతుపతి సినిమాల రిలీజ్ మేళా జరగబోతోంది.

సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా సినిమాలు చేస్తూ.. ప్రజెంట్ 14 సినిమాలను లైన్లో పెట్టారు విజయ్ సేతుపతి. వీటిలో 4 సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. సెప్టెంబర్ 9న ‘లాభం’ సినిమాతో పాటు సెప్టెంబర్ 11న ‘తుగ్లక్ దర్బార్’, 17న ‘అనబెల్లె సేతుపతి’, 24న ‘కడయ్ శివవాసవై’ అనే విజయ్ సేతుపతి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకే నెలలో 4 సినిమాలు అది కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు విజయ్ సేతుపతి..

Kadaisi Vivasayi