Big Boss 5 Telugu: గ్లాస్‌హౌస్‌లో ఫన్ బకెట్ భార్గవ్, ఉన్నట్లా.. లేనట్లా?

ఇంట్లో ఉంటూ ఇంటిల్లిపాదినీ అలరించేందుకు బిగ్ బాస్ ఈ సీజన్ మొదలు కాబోతుంది. ఇప్పటికే లోగో కూడా విడుదల చేసిన స్టార్ మా యాజమాన్యం ప్రోమో షూటింగ్ కూడా పూర్తిచేసింది. ఈ సీజన్ ను కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేయడం దాదాపుగా ఖరారు కాగా ఇప్పటికే కంటెస్టెంట్ల ఏవీల షూటింగ్ కూడా జరిగిపోతుంది.

Big Boss 5 Telugu: గ్లాస్‌హౌస్‌లో ఫన్ బకెట్ భార్గవ్, ఉన్నట్లా.. లేనట్లా?

Big Boss 5 Telugu

Updated On : August 13, 2021 / 1:07 PM IST

Big Boss 5 Telugu: ఇంట్లో ఉంటూ ఇంటిల్లిపాదినీ అలరించేందుకు బిగ్ బాస్ ఈ సీజన్ మొదలు కాబోతుంది. ఇప్పటికే లోగో కూడా విడుదల చేసిన స్టార్ మా యాజమాన్యం ప్రోమో షూటింగ్ కూడా పూర్తిచేసింది. ఈ సీజన్ ను కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేయడం దాదాపుగా ఖరారు కాగా ఇప్పటికే కంటెస్టెంట్ల ఏవీల షూటింగ్ కూడా జరిగిపోతుంది. ఏ మాత్రం కంటెస్టెంట్ల జాబితా లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్న యాజమాన్యం ఏవీల షూటింగ్ పూర్తికాగానే అందరినీ క్వారంటైన్ కు పంపనున్నారు.

ఇప్పటికే యాంకర్ రవి, లోబోలతో పాటు ఆర్టిస్ట్ ప్రియాల ఏవీస్ పూర్తిచేసినట్లు తెలుస్తుండగా ఆగష్టు 15 నాటికి అందరి కంటెస్టెంట్లపై ఏవీస్ పూర్తి చేయనున్నారట. కాగా, ఈ సీజన్ కంటెస్టెంట్స్ వీరే అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో హోరెత్తిపోతుండగా అందులో కొందరు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ పేరును కూడా చేర్చి వైరల్ చేశారు. మరికొందరు భార్గవ్ ఈ షోకు వెల్ళడం లేదని ప్రచారం చేస్తున్నారు. దీంతో భార్గవ్ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెడతాడా లేదా అన్న చర్చ జరుగుతుంది.

యూట్యూబర్ గా మంచి పేరు తెచ్చుకున్న భార్గవ్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ప్రస్తుతం జైలు నుండి బయటకొచ్చిన భార్గవ్ తిరిగి తన వీడియోలతో ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ ఎంట్రీ అతని కెరీర్ కి పనికివచ్చే అవకాశమే ఉండగా షో నిర్వాహకులు మాత్రం భార్గవ్ పై ఆసక్తిగా లేరని చెప్పుకుంటున్నారు. కాగా, ఆగష్టు 15న బిగ్ బాస్ ప్రోమో విడుదల కానుండగా ఇక షో మొదలయ్యే లోపు ఎన్ని ప్రచారాలు జరుగుతాయో ఏమో!