Unstoppable with NBK: తనలో మరో యాంగిల్ చూపిస్తున్న ఫన్నీ బాలయ్య!
బాలకృష్ణతో టాక్ షోనా? అసలు బాలయ్యతో టాక్ షో ఏంటి? సరిగ్గా ఎవరి మాటా వినని బాలయ్య అంత ఓపిగ్గా అన్ని గంటలసేపు ఓ టాక్ షోని హోస్ట్ చెయ్యడమంటే?.. అసలు ఇది జరిగేపనేనా అని డౌట్..

Unstoppable With Nbk
Unstoppable with NBK: బాలకృష్ణతో టాక్ షోనా? అసలు బాలయ్యతో టాక్ షో ఏంటి? సరిగ్గా ఎవరి మాటా వినని బాలయ్య అంత ఓపిగ్గా అన్ని గంటలసేపు ఓ టాక్ షోని హోస్ట్ చెయ్యడమంటే?.. అసలు ఇది జరిగేపనేనా అని డౌట్ పడిన వాళ్లకు ఫస్ట్ షో తోనే సూపర్ హిట్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ. యంగ్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు అన్నతేడా లేకుండా వరుస పెట్టి ఇంటర్వ్యూలు చేస్తూ.. తనలోని మరోయాంగిల్ ని చూపిస్తున్నారు బాలయ్య. బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. టైటిల్ కి యాప్ట్ అయ్యేలా బాలయ్య ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా అన్ స్టాపబుల్ షోతో అదరగొడుతున్నారు బాలయ్య.
Hari Hara Veera Mallu: హీరోయిన్ ఫిక్స్.. జాక్వెలిన్ స్థానంలో కెనడియన్ బ్యూటీ!
బాలయ్య ఫస్ట్ టైమ్ అచ్చతెలుగు ఓటీటీ యాప్ ఆహా కోసం ఇలా రంగంలోకి దిగారో లేదో రికార్డ్ వ్యూస్ తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. బాలయ్య అన్ స్టాపబుల్ ని టైటిల్ కి తగినట్టే అన్ స్టాపబుల్ గా నడిపిస్తున్నారు. ఫస్ట్ షో దగ్గరనుంచే ఫాన్స్ లో విపరీతంగా ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది అన్ స్టాపబుల్. యంగ్ హీరోలను ఎలాడీల్ చేస్తాడో అనుకున్నవాళ్లకి.. వాళ్ల ఏజ్ కి తగినట్టే ఎనర్జీని మ్యాచ్ చేశారు బాలయ్య. రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ టీమ్ ఎపిసోడ్ లో మెంబర్స్ అందర్నీటీజ్ చేస్తూ ఓ ఆటఆడించారు బాలకృష్ణ.
Bigg Boss 5 Telugu: ఫినాలేకి ముందే మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్.. నిజమా?
చూడు ఒక వైపే చూడు అంటూ సినిమాలో సీరియస్ గా వార్నింగ్ అయితే ఇచ్చారు కానీ.. రియల్ లైఫ్ లో మాత్రం బాలయ్య రెండో వైపు అదిరగొడుతున్నారు. అసలు ఇప్పటి వరకూ ఎవరూ చూడని యాంగిల్ ని, తనలోని మరో వర్షన్ ని చూపిస్తున్నారు బాలకృష్ణ. ఎప్పుడూ సీరియస్ గా ఉండే బాలయ్య.. టాప్ స్టార్లని, డైరెక్టర్లని ఓ ఆట ఆడుకుంటూ ఫన్ జనరేట్ చేస్తూ.. ఫాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు. వరసపెట్టి నాని, బ్రహ్మానందం, అఖండ టీమ్ తో పాటు లేటెస్ట్ గా స్టార్ డైరెక్టర్ రాజమౌళితో ఇంటర్వ్యూ కంప్లీట్ చేశారు బాలకృష్ణ.
Unstoppable: ఈ సాయంత్రం సూపర్ ఎంజాయ్‌మెంట్.. బాలయ్యతో మహేష్!
ఫస్ట్ ఎపిసోడ్ లో మోహన్ బాబు అండ్ బ్యాచ్ తో మిక్స్ డ్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చారు. ఒకవైపు సీరియస్ టాక్ నడుస్తున్నా.. తన స్టైల్లో బాలయ్య కౌంటర్లిస్తూ షోని ఎండ్ వరకూ సూపర్బ్ గా రన్ చేశారు. నెక్ట్స్ యంగ్ హీరో నానితో పాటు.. అనిల్ రావిపూడి, బ్రహ్మానందం షోలో కూడా ఫుల్ ఫన్ జనరేట్ చేశారు. లేటెస్ట్ గా స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పాటు, మరో స్టార్ హీరో మహేష్ బాబుతో కూడా అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ ని ఫుల్ ఫన్నీగా కంప్లీట్ చేశారు బాలయ్య. ఏమాత్రం ఫిల్టర్లు లేకుండా బాలయ్య చేస్తున్న ఈ షో మంచి వ్యూస్ తో ఆడియన్స్ కి బాలయ్యలోని మరో యాంగిల్ ని చూపిస్తోంది.
Unstoppable Aha: ఇది వేరే లెవెల్.. బాలయ్య షోలో జక్కన్న-కీరవాణి!