గాలి ప్రభావం.. దేవుళ్ళు దిగి వచ్చారు…

Gaali Sampath: శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్న చిత్రం ‘గాలి సంపత్’.
అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది, కృష్ణ కలిసి నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం అరకులో షూటింగ్ జరుగుతోంది. ముఖ్య తారాగణమంతా పాల్గొంటుంది. ‘గాలి ప్రభావం.. దేవుళ్ళు దిగి వచ్చారు..’
అంటూ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.అరకు షెడ్యూల్ డిసెంబర్ 5వ తేదీ వరకు జరుగుతుందని, ఆ తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తామని నిర్మాతలు తెలిపారు.
https://10tv.in/nagababu-strong-reply-to-prakash-raj-over-pawan-kalyan-issue/
ఈ సినిమాకి సంగీతం : అచ్చు, కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : తమ్మిరాజు, డైలాగ్స్ : మిర్చి కిరణ్, ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్.