Gadar 2 : ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా బంపర్ ఆఫర్.. 2 టికెట్లు కొంటే మ‌రో 2 ఫ్రీ.. ఐదు రోజులు పండ‌గే

బాలీవుడ్ సీనియ‌ర్ హీరో స‌న్నీడియోల్ (Sunny Deol) న‌టించిన చిత్రం గదర్ 2 (Gadar 2). అనిల్ శర్మ (Anil Sharma) ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ ఈ సినిమాలో అమీషా పటేల్ (Ameesha Patel) క‌థానాయిక‌.

Gadar 2 : ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా బంపర్ ఆఫర్.. 2 టికెట్లు కొంటే మ‌రో 2 ఫ్రీ.. ఐదు రోజులు పండ‌గే

Gadar 2

Gadar 2 Tickets Free Offer : బాలీవుడ్ సీనియ‌ర్ హీరో స‌న్నీడియోల్ (Sunny Deol) న‌టించిన చిత్రం గదర్ 2 (Gadar 2). అనిల్ శర్మ (Anil Sharma) ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ ఈ సినిమాలో అమీషా పటేల్ (Ameesha Patel) క‌థానాయిక‌. 2001లో యుద్ధ నేప‌థ్యంలో వ‌చ్చిన గ‌ద‌ర్ సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్కింది గ‌ద‌ర్ 2. ఈ సినిమా ఆగ‌స్టు 11 న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పాకిస్థాన్- ఇండియా బోర్డర్ కథతో పాటు ఓ ప్రేమకథని కూడా కలిపి ఎమోషనల్‌గా చూపించడంతో సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

Rocking Rakesh : హీరోగా రాకింగ్ రాకేష్‌.. ఎంపీ సంతోష్ కుమార్ క్లాప్‌తో ప్రారంభమైన సినిమా

బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. చాలా రోజుల త‌రువాత స‌న్నీడియోల్‌కు ఈ సినిమా ద్వారా సాలీడ్ హిట్ ల‌భించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా రూ.460 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా బుక్ మై షో (Book My Show) గ‌ద‌ర్ 2 సినిమాకు సంబంధించి ఓ ఆఫ‌ర్ ను తీసుకువ‌చ్చారు. ఈ సినిమాకు రెండు టికెట్లు బుక్ చేసుకుంటే మ‌రో రెండు టికెట్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఇందుకోసం GADAR 2 ప్రోమో కోడ్‌ను యూజ్ చేయాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా జీ స్టూడియోస్ తెలియ‌జేసింది. ఈ ఆఫ‌ర్ సెప్టెంబ‌ర్ 3 వ‌ర‌కు ఉంటుంద‌ని, కొన్ని ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ‌ని తెలిపింది.

Sankranti 2024 : ఈసారి పండక్కి సినిమాల జాతర మాములుగా లేదుగా..

Mokshagna : భగవంత్ కేసరి సినిమాలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్.. అభిమానులు అనుకోవడమే కానీ..