Mokshagna : భగవంత్ కేసరి సినిమాలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్.. అభిమానులు అనుకోవడమే కానీ..

నందమూరి వంశంలో మోక్షజ్ఞపైనా భారీ అంచనాలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. మోక్షజ్ఞ కూడా తరచూ తన తండ్రి బాలకృష్ణ షూటింగ్ స్పాట్లకు వెళుతూ నటనలో మెలకువలు నేర్చుకుంటున్నారు.

Mokshagna : భగవంత్ కేసరి సినిమాలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్.. అభిమానులు అనుకోవడమే కానీ..

Mokshagna Guest Role in Bhagavanth Kesari Movie Rumors goes viral

Mokshagna : నట సింహం బాలకృష్ణ(Balakrishna) కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ సమయం వచ్చేసిందని అంటున్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీపై ఫ్యాన్స్‌కు ఎన్నో ఎక్స్‌పెటేషన్స్ ఉండగా.. ఆ ఉత్కంఠకు తెరదించుతూ.. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందోగాని భగవంత్ కేసరి సెట్స్‌లో మోక్షజ్ఞ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

నందమూరి నట సింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ప్రవేశంపై ఎన్నో ప్రచారాలు జరిగాయి. త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ.. మొదటి చిత్రం ఎలా ఉంటుందని ఫ్యాన్స్‌లో ఎంతో ఆసక్తి కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే మోక్షజ్ఞ తొలి సినిమా యాక్షన్ ఓరియేంటెడ్‌గా ఉంటుందని ఒకసారి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తాడని మరోసారి ప్రచారం జరిగింది. అంతేకాదు మంచి ప్రేమ కథాంశంతో మొదటి సినిమా చేస్తారనే టాక్ కూడా కొన్నాళ్లు నడిచింది. నటనపై అమితాసక్తి పెంచుకున్న మోక్షజ్ఞ సినీ ప్రవేశంపై ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రచారాలు జరగడమే కాని అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

నందమూరి వంశంలో మోక్షజ్ఞపైనా భారీ అంచనాలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. మోక్షజ్ఞ కూడా తరచూ తన తండ్రి బాలకృష్ణ షూటింగ్ స్పాట్లకు వెళుతూ నటనలో మెలకువలు నేర్చుకుంటున్నారు. గతంలో వీరసింహారెడ్డి సెట్స్‌లో సందడి చేసిన మోక్షజ్ఞ.. ఆ సినిమాలో ఓ పాత్రలో నటించనున్నాడనే ప్రచారం జరిగింది. కానీ, ఇంతవరకు మోక్షజ్ఞ ఎంట్రీయే ఇవ్వలేదు. ఐతే ఇప్పుడు ఓ ఫొటో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి.. టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) కూడా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా 90 శాతం చిత్రీకరణ పూర్తికాగా, మోక్షజ్ఞకు సీన్ వివరిస్తున్నట్లు కనిపించే ఫోజులో ఓ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇంకేముంది మోక్షజ్ఞ భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది.

Onam Celebrations : మన సెలబ్రిటీల ఓనమ్ సెలబ్రేషన్స్.. చీరల్లో భామలు.. సాంప్రదాయంగా హీరోలు..

దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీలతో మోక్షజ్ఞ ఉన్న ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోను ట్యాగ్ చేస్తూ భగవంత్ కేసరిలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు పోస్టులు పెడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమోకాని ప్రస్తుతానికి టాలీవుడ్‌ను ఊపేస్తోంది. మరోవైపు మోక్షజ్ఞ ఎంట్రీపై సస్పెన్స్‌ను భగవంత్ కేసరి యూనిట్ తెరదించాలని కోరుతున్నారు ఫ్యాన్స్. ఇక కొంతమంది అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా తీసుకోవాలని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Mokshagna Guest Role in Bhagavanth Kesari Movie Rumors goes viral