Director Apsar : వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్న కొత్త డైరెక్టర్ అప్సర్

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త దర్శకుల హవా కొనసాగుతోంది. కొత్త కంటెంట్, కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తూ తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది గంధర్వ సినిమాతో దర్శకుడిగా అప్సర్ తన ప్రతిభను చాటుకున్నాడు.

Director Apsar : వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్న కొత్త డైరెక్టర్ అప్సర్

Gandharwa director apsar getting good projects in row

Updated On : April 22, 2023 / 7:44 PM IST

Director Apsar : ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త దర్శకుల హవా కొనసాగుతోంది. కొత్త కంటెంట్, కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తూ తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది గంధర్వ సినిమాతో దర్శకుడిగా అప్సర్ తన ప్రతిభను చాటుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన గంధర్వ ఆడియెన్స్‌ అందరినీ ఆకట్టుకుంది. తొలి ప్రయత్నంలోనే వినూత్నమైన కథాంశం యాంటి ఏజింగ్ ని ఎంచుకొని సాహసమే చేసాడు.

Two Souls Review : రెండు ఆత్మల ప్రేమ.. టు సోల్స్.. సిక్కిం అందాలలో అందమైన ప్రేమకథ..

గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఓటీటీలో తెలుగు తమిళ భాషల్లో మంచి ఆదరణను దక్కించుకుంది. రికార్డ్ వ్యూస్‌తో గంధర్వ దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు అప్సర్ తన కొత్త సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. మరో ఆసక్తికరమైన పాయింట్‌తో పెద్ద నిర్మాణ సంస్థతో మరో ప్రాజెక్ట్ తో ఈ నెల ఆఖరున సెట్స్ మీదికి వెళ్ళనుండగా సినిమా గురించి త్వరలోనే అప్డేట్స్ ఇస్తానని దర్శకుడు చెప్పుకొచ్చారు.

Ranbir Kapoor – Alia Bhatt : భార్య చెప్పులు మోసిన రణ్‌బీర్‌.. తప్పంటూ నెటిజెన్లు ట్రోల్.. రీజన్ ఏంటి?

రెండో ప్రాజెక్ట్ ఇలా ఉండగా.. మూడో సినిమాను కూడా లైన్‌లో పెట్టేశారు. బడా ప్రొడక్షన్ హౌస్ తో మరో క్రేజీ కాంబో కూడా సెట్ చేసుకున్నారు. ఇప్పటికే తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్న అప్సర్, ఇప్పటి వరకు ఎవరు ఊహించని మరో రెండు కథలతో త్వరలోనే మన ముందుకు రానున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.