Gangavva : గంగవ్వ చొరవతో ఆ ఊరికి మొదలైన బస్ సర్వీస్
గంగవ్వ సొంతూరు లంబాడిపల్లి గ్రామానికి మొదట్లో బస్సు సర్వీసు ఉండేది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా లంబాడిపల్లికి ఆర్టీసీ బస్సు సర్వీసు ఆపేశారు. దీంతో గ్రామస్థులు........

Lambadapalli
Gangavva : యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ గంగవ్వకి ఎంత ఫేమ్ ఉందో మన అందరికి తెలిసిందే. మై విలేజ్ షో ఛానల్ లో తన కామెడీ నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఆ ఛానల్ తో పేరు సంపాదించి, బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది. బిగ్ బాస్, సినిమాలతో మరింత పాపులర్ అయింది గంగవ్వ. సోషల్ మీడియాలో కూడా తనకి ఫాలోవర్స్ బాగానే ఉన్నా|రు. ఇక కొన్ని సినిమాలు ప్రమోషన్స్ కి గంగవ్వని కూడా వాడతాయి.
గంగవ్వకి ఒక సొంత ఇల్లు ఉండాలి అనుకుంది. బిగ్ బాస్ వల్ల, నాగార్జున చొరవతో తన సొంతూళ్లో గంగవ్వ ఇల్లు కట్టుకుంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం గంగవ్వ సొంతూరు. గంగవ్వ ఇప్పటికి అక్కడే ఉంటుంది. ఏదైనా షూట్, వర్క్ ఉంటేనే హైదరాబాద్ కి వస్తూ ఉంటుంది. ఇక గంగవ్వ సొంతూరు లంబాడిపల్లి గ్రామానికి మొదట్లో బస్సు సర్వీసు ఉండేది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా లంబాడిపల్లికి ఆర్టీసీ బస్సు సర్వీసు ఆపేశారు. దీంతో గ్రామస్థులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్లి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో జగిత్యాలకు వెళ్లి రావాలంటే చార్జీలు ఎక్కువ అవుతున్నాయి.
Warangal srinu : ఆచార్య నైజాం హక్కులు భారీ ధరకి.. దిల్ రాజుని కాదని ఇంకొకరికి..
దీంతో తమ ఊరికి మళ్ళీ బస్సు సర్వీస్ తీసుకురావాలని అనుకొని గంగవ్వ, మై విలేజ్ షో టీం, గ్రామస్థులు కలిసి జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులతో మాట్లాడారు. లంబాడిపల్లి గ్రామానికి ఇదివరకు ఉన్నట్టే బస్సు సర్వీస్ వెయ్యాలని కోరారు. గంగవ్వ కోరడంతో అక్కడి ప్రజల బాధలని అర్ధం చేసుకొని లంబాడిపల్లికి మళ్ళీ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసుని గంగవ్వ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించింది. ప్రస్తుతం ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఐదు ట్రిప్పులుగా ఆర్టీసీ బస్ సర్వీస్ ని నడిపిస్తుంది. దీంతో ఆ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ గంగవ్వకి ధన్యవాదాలు తెలిపారు.