Warangal srinu : ఆచార్య నైజాం హక్కులు భారీ ధరకి.. దిల్ రాజుని కాదని ఇంకొకరికి..

ఇటీవల క్రాక్ సినిమా సమయంలో దిల్ రాజుకి వరంగల్ శ్రీనుకి గొడవలు కూడా జరిగాయి. క్రాక్, నాంది, ఇలా వరుసగా కొన్ని పెద్ద సినిమాలు, ఓ మోస్తరు సినిమాలు రిలీజ్ చేస్తూ.......

Warangal srinu : ఆచార్య నైజాం హక్కులు భారీ ధరకి.. దిల్ రాజుని కాదని ఇంకొకరికి..

Warangal Srinu

Acharya :  తెలుగు సినిమాల్లో నైజాం డిస్ట్రిబ్యూషన్ అనగానే గుర్తొచ్చే పేరు అగ్ర నిర్మాత దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గానే ప్రయాణం మొదలు పెట్టిన దిల్ రాజు నిర్మాతగా మారినా బడా బడా సినిమాల నైజాం హక్కులన్నీ ఈయనే కొంటారు. పెద్ద సినిమాలన్నీ నైజాంలో ఈయన రిలీజ్ చేయాల్సిందే. చాలా మంది చిన్న డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నా పెద్ద సినిమాలు వారి దాకా వెళ్లనివ్వరు దిల్ రాజు. అయితే ఇటీవల మరో డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకి పోటీగా నైజాంలో వస్తున్నారు. మొదట చిన్న చిన్న సినిమాలతో డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టిన వరంగల్ శ్రీను ఇప్పుడు పెద్ద సినిమాలని కూడా నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

 

ఇటీవల క్రాక్ సినిమా సమయంలో దిల్ రాజుకి వరంగల్ శ్రీనుకి గొడవలు కూడా జరిగాయి. క్రాక్, నాంది, ఇలా వరుసగా కొన్ని పెద్ద సినిమాలు, ఓ మోస్తరు సినిమాలు రిలీజ్ చేస్తూ దిల్ రాజుకి నైజాంలో ప్రత్యామ్నాయంగా ఎదిగారు. ఇప్పుడు ఏకంగా ఆచార్య సినిమాని భారీ ధరకి వరంగల్ శ్రీను కొన్నారు. ‘ఆచార్య’ నైజాం డిస్ట్రిబ్యూషన్‌ను వరంగల్ శ్రీను 42 కోట్లకు సొంతం చేసుకున్నారు. ‘ఆచార్య’ డిస్ట్రిబ్యూషన్ విషయంలో దిల్ రాజుకు, వరంగల్ శ్రీనుకి మధ్య గట్టి పోటీ నడిచిందని, కానీ శ్రీను పట్టుబట్టి మరీ ఎక్కువ మొత్తం చెల్లించి ఈ మెగా ఆచార్య సినిమా హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం.

Acharya : ఆచార్య మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్

వరంగల్ శ్రీను తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”ఆచార్య సినిమాలో మంచి కథ ఉంది. ఇది కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది. నేను చిరంజీవి గారిని చూసే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆయన్ని చూసే ఏదైనా సాధించాలని వచ్చాను. నా హీరో సినిమాకి నేను ఎప్పుడెప్పుడు ప్రొడ్యూస్ చేయాలా అని ఎదురుచూస్తున్నాను. కానీ ఇన్నేళ్లకు ఇలా ఆయన సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా నాకు రాకుండా చేయడానికి చాలామంది ట్రై చేశారు. వాళ్లు ఎవరనేది మీకు తెలుసు. కానీ నేను వెనక్కి తగ్గలేదు, తగ్గను. సినిమా కొనాలని అనుకున్నాను, కొన్నాను. ఈ సినిమాని 42 కోట్లకు కొన్నాను.”

Suhasini : చిరంజీవి, సుహాసిని స్పెషల్ వాట్సాప్ గ్రూప్.. అందులో ఎవరెవరు ఉంటారో తెలుసా??

”నాకు మెగా హీరోలతో చేయాలని ఎప్పట్నుంచో ఉంది. ఇలా ‘ఆచార్య’కి అన్నీ కుదిరి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఏడాదిన్నర క్రితమే ఈ సినిమాను నేను కొన్నాను. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రచ్చ రచ్చే. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది” అని తెలిపారు. అయితే గతంలో దర్శకుడు కొరటాల శివ, దిల్ రాజుకి మధ్య ‘భరత్‌ అనే నేను’ సినిమా విషయంలో చిన్న తగాదాలు రావడంతో ఇప్పుడు ‘ఆచార్య’ డిస్ట్రిబ్యూషన్ దిల్ రాజుకి కాకుండా వరంగల్ శ్రీనుకి వచ్చేలా చేశారని సమాచారం. ఈ సినిమాతో నైజాంలో బడా డిస్ట్రిబ్యూటర్ గా మారనున్నారు వరంగల్ శ్రీను. భవిష్యత్తులో మరిన్ని పెద్ద సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు కూడా.