Gautam Krishna: “బాహుబలి ది ఎపిక్” చూసిన గౌతమ్ కృష్ణ.. నాన్న సినిమా గురించి ఏమన్నాడో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి ఎం చేసిన ట్రెండ్ సెట్టింగ్ అవుతుంది. బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో ఇండియన్ (Gautam Krishna)సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో నిలబెట్టిన జక్కన్న ఆ తరువాత చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డు ను సాధించాడు.
Gautham Krishna interesting comments about Rajamouli-Mahesh Babu movie
Gautam Krishna: దర్శకధీరుడు రాజమౌళి ఎం చేసిన ట్రెండ్ సెట్టింగ్ అవుతుంది. బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో నిలబెట్టిన జక్కన్న ఆ తరువాత చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డు ను సాధించాడు. (Gautam Krishna)ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ విషయంలో కూడా ఆలాగే కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు. బాహుబలి రెండు భాగాలను కలిపి ది ఎపిక్ పేరుతో విడుదల చేశాడు. అక్టోబర్ 30న విడుదలైన ఈ సినిమాకు కూడా ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ తన రివ్యూను ఇచ్చాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Lokesh Kanagaraj: పాపం లోకేష్ కనగరాజ్.. ఖైదీ 2 కూడా క్యాన్సిల్?.. డిజాస్టర్ సినిమా ఎఫెక్ట్
ప్రెజెంట్ విదేశాల్లో చదువును కంటిన్యూ చేస్తున్న గౌతమ్ కృష్ణ తాజాగా బాహుబలి ది ఎపిక్ సినిమా చూశాడు. సినిమా చూసి బయటకు వస్తున్న గౌతమ్ కృష్ణను ప్రముఖ టీవీ ఛానల్ రివ్యూ అడిగింది దానికి గౌతమ్ కృష్ణ సమాధానం ఇస్తూ.. ప్రపంచంలోనే అతి పెద్దదైన థియేటర్ లో బాహుబలి ది ఎపిక్ సినిమా చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది తెలుసుకోవడానికి రెండేళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు” అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. అనంతరం ఆ రిపోర్టర్ ఇప్పుడు మీ నాన్న మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నాడు దానికి గురించి ఎం చెప్తారు అని అడిగగా..”దానికి గురించి నన్ను ఏమీ అడగొద్దు అని చెప్పి”తెలివిగా తప్పించుకున్నాడు గౌతమ్ కృష్ణ. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
ఇక మహేష్ బాబు, రాజమౌళి సినిమా విషయానికి వస్తే, హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. గ్లోబ్ ట్రాటర్ అనే ట్యాగ్ తో వస్తున్న ఈ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ మూవీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇక ఈ సినిమాకు సంబందించిన టైటిల్ అండ్ టీజర్ నవంబర్ లో విడుదల కానుంది.
