Gautham Vasudev Menon : చైతూతో ‘ఏ మాయ చేసావె 2’ చేయాలనుకుంటున్నా.. సమంత ఒప్పుకుంటుందా..?

గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ.. ''కమల్‌హాసన్‌గారితో ‘రాఘవన్‌ 2’ ప్లాన్‌ చేయాలనుకుంటున్నాను. అలాగే వెంకటేష్‌గారితో ‘ఘర్షణ 2’, నాగచైతన్యతో ‘ఏ మాయ చేసావె 2’ కూడా ప్లాన్ చేస్తాను భవిష్యత్తులో............

Gautham Vasudev Menon : చైతూతో ‘ఏ మాయ చేసావె 2’ చేయాలనుకుంటున్నా.. సమంత ఒప్పుకుంటుందా..?

Gautham Vasudev Menon wants to plan Ye Maya Chesave 2 with Naga Chaitanya

Updated On : September 16, 2022 / 7:46 AM IST

Gautham Vasudev Menon :  డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తమిళ్ సినిమాలతో పాటు, తెలుగులో ఘర్షణ, ఏమాయ చేసావే లాంటి సినిమాలతో మెప్పించారు. ఓ పక్క వరుసగా సినిమాలని తెరకెక్కిస్తూనే, మరోపక్క నటుడిగా కూడా బిజీగా ఉన్నారు. అయన సినిమాలకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాల్లో లవ్ స్టోరీస్, థ్రిల్లర్స్ కలిపి సరికొత్తగా తెరకెక్కిస్తారు. లవ్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్స్ లో ఆయన చాలా స్పెషల్.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రస్తుతం శింబు హీరోగా, సిద్ది ఇదాని హీరోయిన్ గా ‘వెందు తనిందదు కాడు’ అనే సినిమాని తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమా ‘ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’ పేరుతో సెప్టెంబర్ 17న రిలీజ్ అవ్వనుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ తన సినిమాల్లోని కొన్నిటికి పార్ట్ 2 చేయాలని ఉందని తెలిపారు.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ.. ”కమల్‌హాసన్‌గారితో ‘రాఘవన్‌ 2’ ప్లాన్‌ చేయాలనుకుంటున్నాను. అలాగే వెంకటేష్‌గారితో ‘ఘర్షణ 2’, నాగచైతన్యతో ‘ఏ మాయ చేసావె 2’ కూడా ప్లాన్ చేస్తాను భవిష్యత్తులో” అని తెలిపారు. గతంలో ఈ సినిమాలు భారీ విజయం సాధించాయి. ఇప్పుడు వాటికి సీక్వెల్స్ తెరకెక్కిస్తాను అని చెప్పడంతో ఆసక్తి నెలకొంది.

Aparna Balamurali : లావుగా ఉన్నానని 27 ఏళ్లకే తల్లి పాత్రలు చేయమని అడుగుతున్నారు..

అయితే గతంలో ఏమాయ చేసావే సినిమా నాగచైతన్య, సమంత జంటగా తెరకెక్కించారు. అక్కడ్నించి వారి ప్రేమ మొదలైంది. వారిద్దరికి తొలి హిట్ సినిమా కుడా అదే. కానీ ఇప్పుడు ఇద్దరూ విడిపోయారు. అయితే డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ నాగచైతన్యతోనే ఏమాయ చేసావే 2 తీస్తాను అని చెప్పడంతో మరి హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆ సినిమాలో సమంత, చైతూ జంట చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇప్పుడు కూడా సమంతని తీసుకుంటారా, ఒకవేళ సమంతని అడిగితే తను ఒప్పుకుంటుందా, లేదా వేరే హీరోయిన్ తో చేస్తారా అని అభిమానుల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ సినిమాని ఎవరితో చేస్తారు, ఎప్పుడు చేస్తారో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.