Geeta Singh : గీతా సింగ్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కితకితలు సినిమాకు ఎంత ఎక్కువ ఇచ్చారో తెలుసా?

తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతా సింగ్ తన మొదటి సినిమా రెమ్యునరేషన్ తో పాటు కితకితలు రెమ్యునరేషన్ గురించి చెప్పింది.(Geeta Singh)

Geeta Singh : గీతా సింగ్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కితకితలు సినిమాకు ఎంత ఎక్కువ ఇచ్చారో తెలుసా?

Geeta Singh

Updated On : September 3, 2025 / 12:14 PM IST

Geeta Singh : కితకితలు సినిమాతో ఫేమ్ తెచ్చుకుంది గీతా సింగ్. అంతకుముందే కొన్ని సినిమాల్లో నటించింది. కితకితలు తర్వాత పలు సినిమాల్లో కమెడియన్ గా నటించింది కానీ పలు కారణాలతో సినిమాలకు దూరమైపోయింది. ఇటీవలే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది గీతా సింగ్.(Geeta Singh)

తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతా సింగ్ తన మొదటి సినిమా రెమ్యునరేషన్ తో పాటు కితకితలు రెమ్యునరేషన్ గురించి చెప్పింది.

Also Read : Kishkindhapuri : ‘కిష్కింధపురి’ ట్రైలర్ వచ్చేసింది.. బెల్లంకొండ, అనుపమ హారర్ థ్రిల్లర్ అదిరిందిగా..

గీతా సింగ్ మాట్లాడుతూ..నా మొదటి సినిమా తేజ గారితో ‘జై’ సినిమా చేసాను. ఆడిషన్ కి వెళ్తే సెలెక్ట్ చేసుకున్నారు. అప్పటికి కాలేజీ చదువుతున్నాను. తేజ గారంటే కొడతారు అని అప్పట్లో అందరికి భయం. సినిమాలో ఒక సీన్ లో నేను వేరే నటుడి చెయ్యి పట్టుకొని కొరకాలి. ఆ సీన్ లో నేను నిజంగా కొరికేశా, సెట్ అంతా అందరూ నవ్వేశారు. కట్ చెప్పకుండా నవ్వుతూనే ఉన్నారు నేను చేసిన యాక్టింగ్ కి. ఆ విషయం ఇండస్ట్రీలో తెలిసి ఇవివి సత్యనారాయణ గారు పిలిచి ఎవడిగోల వాడిదేలో అవకాశం ఇచ్చారు. జై సినిమాకు నాకు పదివేలు రెమ్యునరేషన్ ఇచ్చారు. అప్పట్లో నాకు అది చాలా ఎక్కువ అని తెలిపింది.

అలాగే కితకితలు సినిమా రెమ్యునరేషన్ గురించి చెప్తూ.. అసలు ఆ సినిమాకు నేను రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. దాని బడ్జెట్ కేవలం 60 లక్షలు మాత్రమే. థియేటర్స్ మీద వచ్చిందే కాకుండా అప్పట్లోనే జెమిని టీవీ కితకితలు సినిమాకు 8 కోట్లు పెట్టి శాటిలైట్ రైట్స్ కొనుక్కుంది. దాంతో సినిమా అయ్యాక నన్ను పిలిచి డైరెక్టర్ రెండున్నర లక్షలు ఇచ్చారు. నేను వద్దన్నా కూడా ఇచ్చారు అని తెలిపింది.

Also Read : Geeta Singh : మంచు విష్ణు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు.. జాబ్ రాగానే చనిపోయాడు.. గీతా సింగ్ ఎమోషనల్..