Geeta Singh : మంచు విష్ణు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు.. జాబ్ రాగానే చనిపోయాడు.. గీతా సింగ్ ఎమోషనల్..
తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతా సింగ్ తన జీవితంలో జరిగిన ఓ విషాద సంఘటన గురించి తెలిపింది.(Geeta Singh)

Geeta Singh
Geeta Singh : కితకితలు సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న గీతా సింగ్ ఆ తర్వాత పలు సినిమాల్లో కమెడియన్ గా పేరు తెచ్చుకుంది. కానీ సడెన్ గా సినిమాలకు దూరమైపోయింది. ఇటీవలే మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతా సింగ్ తన జీవితంలో జరిగిన ఓ విషాద సంఘటన గురించి తెలిపింది.(Geeta Singh)
గీత సింగ్ తండ్రి, తల్లి, అన్న గతంలోనే చనిపోయారు. గీతా సింగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. తన అన్న చనిపోవడంతో అతని పిల్లలను గీతా సింగ్ దత్తత తీసుకొని పెంచుకుంటుంది. రెండేళ్ల క్రితం గీతా సింగ్ కొడుకు ఓ యాక్సిడెంట్ లో మరణించాడు.
Also Read : Bunny Vasu : ఏపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది.. కానీ ఎవరూ పాటించట్లేదు.. నిర్మాత కామెంట్స్..
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతా సింగ్ మాట్లాడుతూ.. నేను అన్నయ్య కొడుకుని నా కొడుకులాగే పెంచుకున్నాను. తను చనిపోయాడు. అప్పట్నుంచి మనిషి కాలేదు. ఓ సారి టూర్ కి వెళ్ళాడు. డివైడర్ కి గుద్దుకొని యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చాలా రోజుల వరకు నేనైతే మనిషి కాలేదు. నేను కూడా చనిపోయాను అనుకున్నారు అందరూ. నేనెవరికీ హాని చేయలేదు అయినా మనకి ఇలా అయిందేంటి అని బాధపడ్డాను. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. దేవుడి మీద కోపం వచ్చింది. ఏడవని రోజు లేదు. ఇప్పటికి ఏదో ఒక రూపంలో కనిపిస్తాడు, నేను ఏడుస్తాను. నన్ను తీసుకెళ్లి అతన్ని ఉంచినా బాగుండేది. దాన్నుంచి ఇంకా బయటకు రాలేదు అని చెప్తూ ఎమోషనల్ అయింది.
అలాగే.. నా కొడుక్కి విష్ణు బాబు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. టెన్త్ అయ్యాక విష్ణు గారే ఫోన్ చేసి తిరుపతి కాలేజీ లో సీట్ ఉంచాను అని చెప్పాడు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. చదువు అయ్యాక డిసెంబర్ లో జాబ్ వచ్చింది. ఫిబ్రవరిలోనే యాక్సిడెంట్ అయింది. చనిపోయాక కూడా విష్ణు బాబు కాల్ చేసి ఏమైనా హెల్ప్ కావాలంటే అడగండి అని అన్నారు. ఇప్పుడు పాప ఉంది. తనని ఎలాగైనా డాక్టర్ చేయాలి అని తెలిపింది గీతా సింగ్.