Bunny Vasu : ఏపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది.. కానీ ఎవరూ పాటించట్లేదు.. నిర్మాత కామెంట్స్..
బన్నీ వాసు లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమాతో సెప్టెంబర్ 5న రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బన్నీ వాసు మాట్లాడుతూ..(Bunny Vasu)

Bunny Vasu
Bunny Vasu : సినీ పరిశ్రమ బాగు కోసం రెండు తెలుగు ప్రభుత్వాలు అన్ని సానుకూల నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఏపీలో అయితే పవన్ కళ్యాణ్ ఉండటంతో సినీ పరిశ్రమకు కావాల్సిన అన్ని పర్మిషన్స్ ఇస్తున్నారు. చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలని పలువురు నిర్మాతలు ఎప్పట్నించి వాపోతున్నారు. చిన్న సినిమాలకు థియేటర్స్ సమస్యలు, టికెట్ రేట్ల సమస్యలు, ఎక్కువ షోలు ఇలాంటి సమస్యలు ఉన్నాయి.(Bunny Vasu)
తాజాగా నిర్మాత బన్నీ వాసు వీటి విషయంలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. చిన్న సినిమాలకు థియేటర్స్ ల ఐదో షో కేటాయించాలి, ముఖ్యంగా పండగలు, హాలిడేస్ సమయాల్లో ఐదో షో చిన్న సినిమాలకు ఇవ్వాలని నిర్మాతలు అడగ్గా ఇటీవల ఏపీ ప్రభుత్వం అందుకు ఓకే చెప్పింది.
బన్నీ వాసు లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమాతో సెప్టెంబర్ 5న రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో చిన్న సినిమాల ఐదో షోపై బన్నీ వాసు మాట్లాడుతూ.. ఏపీలో 5వ షో పండగల సమయం, హాలిడేస్ లో చిన్న సినిమాలకు కేటాయించాలి అని రూల్ ఉంది. వాళ్ళు మంచిగానే ఆలోచించి పెట్టారు. కానీ ఎగ్జిబిటర్స్ ఎవ్వరూ వేయట్లేదు. ఎవరైనా డబ్బులు వచ్చే సినిమాలకే వేస్తారు. నేనైనా, మీరైనా ఒక పెద్ద సినిమా, చిన్న సినిమా ఉంటే పెద్ద సినిమాలకే డబ్బులు వస్తాయి కాబట్టి ఆ ఐదో షో కూడా పెద్ద సినిమానే వేసుకుంటాం. రూల్ పేపర్ల వరకే. కానీ రియల్టీలో బిజినెస్ ని బట్టి మారిపోతూ ఉంటుంది అని అన్నారు.
Also Read : Lokah Movie : మరోసారి వివాదం.. సూపర్ హిట్ సినిమాపై కర్ణాటక నెటిజన్ల విమర్శలు..