Geetha Subramanyam : ఆహాలో.. సూపర్ హిట్ సిరీస్‌కు మరో సీక్వెల్ త్వరలో..

గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ లో బాగా వైరల్ అయిన సిరీస్ గీతా సుబ్రహ్మణ్యం. టామ్ అండ్ జెర్రీలా ఉండే లవర్స్ మధ్య కామెడీ, ఎమోషన్స్, లవ్ అంశాలతో ఈ సిరీస్ ఉంటుంది. మొదటి సీజన్ గీతా సుబ్రహ్మణ్యం యూట్యూబ్ లో బాగా హిట్ అయింది.

Geetha Subramanyam : ఆహాలో.. సూపర్ హిట్ సిరీస్‌కు మరో సీక్వెల్ త్వరలో..

Geetha Subramanyam season 3 coming soon in Aha

Updated On : April 20, 2023 / 9:01 AM IST

Geetha Subramanyam :  తెలుగు ఓటీటీ ఆహా రకరకాల కొత్త సినిమాలు, షోలు, సీరియల్స్, సిరీస్ లతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. తెలుగు ఇండియన్ ఐడల్, అన్ స్టాపబుల్, చెఫ్ మంత్ర, సర్కార్, కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్.. లాంటి పలు కొత్త రకాల షోలు ఆహాకి విశేష ప్రజాదరణ తెచ్చిపెట్టాయి. ఇక ఆహా సొంతంగా కొత్త సినిమాలు, సిరీస్ లు సొంతంగా నిర్మిస్తూ రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే లాక్డ్, మెయిల్, సూపర్ ఓవర్, 11th హావర్, ఏజెంట్ ఆనంద్ సంతోష్, కొత్త పోరడు, కుడి ఎడమైతే.. లాంటి అనేక సిరీస్ లు ఆహాలో వచ్చి ప్రేక్షకులని మెప్పించాయి. తాజాగా ఆహాలో మరో కొత్త సిరీస్ రాబోతుంది.

గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ లో బాగా వైరల్ అయిన సిరీస్ గీతా సుబ్రహ్మణ్యం. టామ్ అండ్ జెర్రీలా ఉండే లవర్స్ మధ్య కామెడీ, ఎమోషన్స్, లవ్ అంశాలతో ఈ సిరీస్ ఉంటుంది. మొదటి సీజన్ గీతా సుబ్రహ్మణ్యం యూట్యూబ్ లో బాగా హిట్ అయింది. ఇందులో మనోజ్ కార్తీక్, దర్శిని జంటగా నటించారు. ఈ సిరీస్ హిట్ అవ్వడంతో దీనికి సెకండ్ సీజన్ ని నిర్మించి రెండేళ్ల క్రితం ఆహాలో రిలీజ్ చేసింది. సెకండ్ సీజన్ లో రామ్ కార్తీక్, నక్షత్ర జంటగా నటించారు. ఈ సీజన్ కూడా మంచి పేరు తెచ్చుకుంది.

Jio Cinema : జియో సినిమా టార్గెట్ ఏంటి? మొన్న 100 సినిమాలు.. నేడు VOOT యాప్ మెర్జింగ్ ప్రకటనలు..

ఇటీవల కొన్ని రోజుల క్రితం గీతా సుబ్రహ్మణ్యం సీజన్ 3 ప్రకటించారు ఆహా. ఈ సారి సుప్రజ్, అభిజ్ఞ జంటగా నటిస్తున్నారు. ఈ సిరీస్ మే 5 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్టు తాజాగా ప్రకటించారు. అధికారికంగా ఆహా ఈ విషయాన్ని ప్రకటించి గ్లింప్స్ రిలీజ్ చేసింది. గత సీజన్స్ లాగే హీరో హీరోయిన్స్ మధ్య కామెడీ ఫైట్స్, లవ్, ఎమోషన్స్ ఉండనున్నాయి. దీంతో ఈ సిరీస్ అభిమానులు కొత్త గీతా సుబ్రహ్మణ్యం కోసం ఎదురుచూస్తున్నారు.

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)