Genilia Deshmukh : రితేష్‌తో 10 సంవత్సరాల ప్రయాణం.. జెనీలియా ఎమోషనల్ పోస్ట్

ఫిబ్రవరి 3, 2012లో రితేష్‌తో జెనీలియా వివాహం అయింది. నిన్నటితో వీరి బంధానికి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. వీరి 10వ పెళ్లి రోజు సందర్భంగా జెనీలియా తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్....

Genilia Deshmukh : రితేష్‌తో 10 సంవత్సరాల ప్రయాణం.. జెనీలియా ఎమోషనల్ పోస్ట్

Geniliya

Updated On : February 4, 2022 / 9:37 AM IST

Genilia Deshmukh :  టాలీవుడ్ లో ‘సత్యం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ‘బొమ్మరిల్లు’ లాంటి భారీ హిట్ సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారి ఎన్నో సినిమాలు చేసింది జెనీలియా. 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లిచేసుకొని సినిమాలకి దూరంగా ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రం కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తుంది జెనీలియా. ప్రస్తుతం తన భర్త డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తుంది.

ఫిబ్రవరి 3, 2012లో రితేష్‌తో జెనీలియా వివాహం అయింది. నిన్నటితో వీరి బంధానికి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. వీరి 10వ పెళ్లి రోజు సందర్భంగా జెనీలియా తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం రితేష్ డైరెక్షన్‌లో జెనిలీయా నటిస్తున్న ‘వేద్’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు.

జెనీలియా తన ఇంస్టాగ్రామ్‌లో… ”10 సంవత్సరాలు అనేది ఖచ్చితంగా ఒక మైలురాయి. అంతే కాక నన్ను తెలుసుకోవడం కూడా. ఈ రోజు మనం కేవలం ఇద్దరం మాత్రమే పట్టణాన్ని విడిచిపెట్టి వేడుకలు, డ్యాన్స్, డైనింగ్ మరియు అంతులేని కౌగిలింతలతో ఉండిపోవాలి. కానీ టైట్ షెడ్యూల్స్ మరియు వర్క్‌తో మాకు మరింత బాగుంది. వర్క్ లో మా పెళ్లిరోజుని జరుపుకోవడంలో నిజమైన అర్థం ఏమిటో నేను గ్రహించాను. నువ్వు మొదటిసారి దర్శకత్వం వహిస్తున్నావు, నేను దానిలో భాగమయ్యాను. నేను 10 సంవత్సరాల తర్వాత నటిస్తున్నాను, నువ్వు అందులో భాగమయ్యావు. మనిద్దరం కలిసి కష్టపడి మన జీవితాన్ని మనం కలిసి ఎంచుకున్న దాంట్లో ఉంచాము. ఇది వేడుక కాకపోతే ఇంకేముంది?”

Vijayashanthi : తమిళనాడులో శశికళని కలిసిన విజయశాంతి.. నటిగానా? పార్టీ తరపునా?

”మేము ప్రేమలో భాగస్వాములు అయ్యాము. తల్లిదండ్రులను, వ్యాపార భాగస్వాములను భాగస్వామ్యం చేసాము మరియు ‘వేద్’ సినిమా కోసం దేవునికి ధన్యవాదాలు. ఇక్కడ మేము ఒకరికొకరు సహాయం చేసుకొని కలలను పెంచుకొని, కలిసి ప్రయత్నిస్తున్నాము. దానిని నెరవేర్చుకునేలా భాగస్వాములు అవుతాము. నేను నీతో ప్రతి రోజు సెలబ్రేషన్ చేసుకుంటాను. నా అంతులేని కౌగిలింతలు ఇంకా కొనసాగుతాయి. నువ్వు నా ప్రేమ నుంచి తప్పించుకోలేవు. పెళ్లిరోజు శుభాకాంక్షలు” అంటూ రితేష్‌ని ట్యాగ్ చేసి వీరిద్దరూ హ్యాపీగా ఉన్న ఓ వీడియోని షేర్ చేసింది.

Raviteja : తమిళ్ హీరో సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న మాస్ మహారాజ్

అటు రితేష్ కూడా.. ”నీతో ఉండటమే నా జీవితంలో గొప్ప వరం. నవ్వు, కన్నీళ్లు, సంతోషం, కష్టాలు, భయాలు, సంతోషాలు పంచుకుంటూ ఇన్ని మైళ్ల దూరం ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నడిచాం. నువ్వు నా పక్కన ఉంటే నేను ఏదైనా చేయగలనని భావిస్తున్నాను. నువ్వు ఉన్నందుకు ధన్యవాదాలు” అని జెనిలీయాతో ఉన్న ఫోటోలని షేర్ చేశాడు. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.