Vijayashanthi : తమిళనాడులో శశికళని కలిసిన విజయశాంతి.. నటిగానా? పార్టీ తరపునా?

విజయశాంతి ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళతో విజయశాంతి చెన్నైలో భేటీ అయ్యారు.......

Vijayashanthi :  తమిళనాడులో శశికళని కలిసిన విజయశాంతి.. నటిగానా? పార్టీ తరపునా?

Vijayashanthi

Updated On : February 4, 2022 / 9:08 AM IST

Vijayashanthi :  ఇటీవల తమిళనాడులో ఓ మిషనరీ స్కూల్‌లో బలవంతపు మత మార్పిడిని తట్టుకోలేక ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన దేశవవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిని వ్యతిరేకిస్తూ తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియచేశారు. మతమార్పిళ్లను ఆపాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. బాలిక ఆత్మహత్యపై బీజేపీ తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వేసిన కమిషన్‌కు విజయశాంతి సారథ్యం వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో విజయశాంతి ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. తంజావూరులో ఆ బాలిక తల్లిదండ్రులతో విజయశాంతి భేటీ అయ్యారు. ఆ తర్వాత చెన్నై వెళ్లారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళతో విజయశాంతి చెన్నైలో భేటీ అయ్యారు.

Raviteja : తమిళ్ హీరో సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న మాస్ మహారాజ్

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన విజయశాంతి శశికళతో మర్యాదపూర్వకంగా ఈ సమావేశం జరిగిందని తెలిపారు. జయలలిత తనపై చూపిన ప్రేమ గురించి విజయశాంతి జ్ఞాపకం చేసుకున్నారు. విజయశాంతి కలవడంపై శశికళ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఒక నటిగా జయలలితని గుర్తు చేసుకుంటూ శశికళని కలిసారా? లేదా పార్టీ పరంగా విజయశాంతి కలిసారా అని ప్రశ్నలు తమిళనాడు రాజకీయాల్లో తలెత్తుతున్నాయి.