‘ఆశాజీవి’ గొల్లపూడి మారుతీరావు రచనా ప్రస్థానం

గొల్లపూడి మారుతీరావు బహు ప్రజ్ఞాశాలి. ఆయనలో ఉండే ఎన్నో ప్రజ్ఞలలో రచయిత ఒకరు. గొల్లపూడి రాసిన తొలి కథ ఆశాజీవి. ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక రేనాడులో 1954 డిసెంబరు 9న ఆశాజీవి కథ వెలువడింది.
ఆడది, కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, రిహార్సల్స్, వాపస్, మహానుభావాలు, నాటకాలకి నిర్మాణం, దర్శకత్వం వహించారు. పువ్వు పుట్టగానే పరమళిస్తుంది అనే మాటకు చక్కని ఉదాహరణ గొల్లపూడి మారుతీరావు. చిన్న వయసులోనే రాఘవ కళా నికేతన్ పేరున ఒక నాటక బృందాన్ని కూడా నడిపేవారు. నాటకాలకు నిర్మాణం, దర్శకత్వం వహించడంతో పాటు, గొల్లపూడి ప్రధానపాత్రధారిగా నటించేవారు కూడా. ఆయన నటనను విమర్శకులు సైతం ప్రశంసించేవారు.
విద్యార్థిగా ఉన్న సమయంలో 16ఏళ్ల వయస్సులోనే ‘అనంతం‘ అనే నాటకం రాశారు.ఆంధ్ర యూనివర్శిటీ రిజిస్ట్రార్ కె.వి.గోపాలస్వామి దర్శకత్వం వహించిన స్నానాలగది నాటకంలోనూ, భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోనూ గొల్లపూడి నటించారు. మనస్తత్వాలు నాటకాన్ని యువజనోత్సవాలలో భాగంగా న్యూఢిల్లీలోని తల్కతోరా ఉద్యానవనంలో ప్రదర్శించారు.
అనంతరం అనే ఆయన రచన ఉత్తమ రేడియో నాటకంగా అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటి సమాచార, ప్రసార శాఖామాత్యుడు డాక్టర్ బి.వి.కేశ్‌కర్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకొన్నారు గొల్లపూడి. చైనా ఆక్రమణపై గొల్లపూడి తెలుగులో మొట్టమొదటి నాటకం రచించటమే కాకుండా..దాన్ని చిత్తూరు, మదనపల్లె, నగరిలలో ప్రదర్శించగా..వచ్చిన యాభై వేల రూపాయల నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి ఇచ్చాడు.
చైనా విప్లవం పై తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటకం వందే మాతరంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి పి.వి. నరసింహారావు దానికి ముందుమాట రాశాడు. 1959, డిసెంబరు 16న రాగరాగిణి అనే నాటకం అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ప్రదర్శించబడింది. పథర్ కే అన్సూ అనే పేరుతో హిందీలోకి కూడా ఇది అనువదించబడింది.
గొల్లపూడి రచనలపై పరిశోధన
గొల్లపూడి మారుతీరావు రచనలను భారతదేశంలోని కొన్ని యూనివర్శిటీల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన వ్రాసిన వ్యాసాలను ఆంధ్ర యూనివర్శిటీ థియేటర్ ఆర్ట్స్ లో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. కళ్ళు నాటకం ఉస్మానియా యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులకు లెసన్ బుక్ గా మారింది.
యన రచనల మీద పరిశోధన చేసి, ఎం.ఫిల్, మరియు డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు అంటే గొల్లపూడి రచనలకు ఉన్న విలువ ఏమిటో ఊహించుకోవచ్చు.ఎన్నో సెమినార్లలో మారుతీరావు చేసిన ప్రసంగాలకు మంచి స్పందన వచ్చేది. ఆయన చక్కటి వాగ్ధాటికి ఎవ్వరూ కదిలేవారు కాదు. అంత చక్కగా ఆయన ప్రసంగం ఉండేది.