Gopi Galla Goa Trip : ‘గోపి గాళ్ల గోవా ట్రిప్’ ట్రైలర్ రిలీజ్.. గోవాకి ఎంజాయ్ చేయడానికి వెళ్తే ఏం జరిగింది..
గోపి గాళ్ల గోవా ట్రిప్ ట్రైలర్ మీరు కూడా చూడండి.. (Gopi Galla Goa Trip)

Gopi Galla Goa Trip
Gopi Galla Goa Trip : రాస్తా ఫిల్మ్స్, ఔరాఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘గోపి గాళ్ల గోవా ట్రిప్’. అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సాయి కుమార్, సీతా రామరాజు, రమణా రెడ్డి నిర్మాణంలో రోహిత్ & శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.(Gopi Galla Goa Trip)
గోపి గాళ్ల గోవా ట్రిప్ ట్రైలర్ మీరు కూడా చూడండి..
Also Read : Niharika : సాయి దుర్గ తేజ్ తో క్యూట్ ఫోటో షేర్ చేసిన నిహారిక.. బావ అంటూ..
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ.. రోహిత్, శశి సినిమాను తీసిన తీరు చూసి నాకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ సినిమాకు ఎలాంటి సహాయమైనా చేసేందుకు నేను రెడీ. ఇదొక యూనిక్ కాన్సెప్ట్ సినిమా అని అన్నారు. మరో దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ.. రోహిత్, శశి నాకు చాలా ఏళ్లుగా తెలుసు. వాళ్లని నేను మొదటి సారి గోవాలోనే కలిశాను. ఈ టైటిల్ విన్న తరువాత అప్పటి రోజులే గుర్తొచ్చాయి. వీళ్ళు చేసిన చాలా షార్ట్ ఫిలిమ్స్ నాకు ఇష్టం అని అన్నారు.
ఈ సినిమా డైరెక్టర్ రోహిత్, శశి మాట్లాడుతూ .. ఇదొక క్రేజీ సినిమా. మాకు షార్ట్ ఫిల్మ్స్‌లు తీయడం అలవాటు. ఇదొక రోడ్ ట్రావెల్ ఫిల్మ్. నిర్మాత సాయి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు అని అన్నారు. నిర్మాత సాయి కుమార్ మాట్లాడుతూ.. రోహిత్, శశి మేకింగ్, స్టోరీ టెల్లింగ్ నచ్చి ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చాను. ఈ సినిమాని చూస్తే గోవాకి వెళ్లి వచ్చినట్టు ఉంటుంది. తెలుగు వాళ్లకి ఇదొక కొత్త ఎక్స్‌పీరియెన్స్ సినిమా అవుతుంది అని అన్నారు.