Shaik Hazarathaiah : చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ.. పవన్ సినిమాకు పనిచేసి.. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ గా..
ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ విజువల్స్ కి మంచి పేరు వచ్చింది. (Shaik Hazarathaiah)

Shaik Hazarathaiah
Shaik Hazarathaiah : వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా ఆర్యన్ సుభాష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కానిస్టేబుల్’. బలగం జగదీష్ నిర్మించిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా ఇటీవల థియేటర్స్ లో రిలీజయి పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ విజువల్స్ కి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకు షేక్ హజారతయ్య (వళి) కెమెరామెన్‌గా పని చేశారు. తాజాగా వళి నేడు మీడియాతో మాట్లాడుతూ తన గురించి, సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.(Shaik Hazarathaiah)
కెమెరామెన్ వళి తన ఇండస్ట్రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. నెల్లూరు దగ్గర మక్కెనవారిపాలెం అనే ఊరి నుంచి చిరంజీవి అభిమానిగా సినీ పరిశ్రమలోకి వచ్చాను. ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నారాయణ గారు నాకు సపోర్ట్ చేసి కెమెరా డిపార్ట్మెంట్‌లో పనికి పెట్టారు. 25 ఏళ్ల క్రితం నా ప్రయాణం మొదలైంది. అరుంధతి, అన్నవరం, ఏక్ నిరంజన్, రగడ.. ఇలా చాలా పెద్ద సినిమాలకు కెమెరా డిపార్ట్మెంట్‌లో పని చేసి తర్వాత కెమెరామెన్ గా మారాను. 25 ఏళ్లలో దాదాపు 78 సినిమాలకు పనిచేసాను. తెలుగుతో పాటు దాదాపు 8 భాషల్లో పని చేశాను. హిందీ, మరాఠీ భాషల్లో నేను కెమెరామెన్ గా చేసిన సినిమాలకు అవార్డులు కూడా వచ్చాయి అని అన్నారు.
Also Read : Sambarala Yeti Gattu : సాయి దుర్గ తేజ్ బర్త్ డే.. ‘సంబరాల ఏటి గట్టు’ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది..
కానిస్టేబుల్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా నిర్మాత బలగం జగదీష్ ఓ సినిమాకు ఆర్టిస్ట్‌గా వచ్చారు. దానికి నేను కెమెరామెన్‌గా చేశాను. నా వర్కింగ్ స్టైల్ ఆయనకు నచ్చి నాతో సినిమా తీస్తాను అన్నారు. అలా ఆయన కానిస్టేబుల్ సినిమాకు నన్ను తీసుకున్నారు. ఆర్యన్ సుభాష్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. వరుణ్ సందేశ్ తో వర్క్ చేస్తే సొంత ఫ్యామిలీ, బ్రదర్‌లా అనిపిస్తుంది. ఓ సారి షూటింగ్‌లో గాయమైనా కూడా రెస్ట్ తీసుకోకుండానే పని చేశారు అని తెలిపారు.
అలాగే.. కానిస్టేబుల్ సినిమా చూసి ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్స్ చేశారు. 30 రోజుల్లోనే అంత క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చావా అని అభినందిస్తున్నారు. ఓ పెద్ద బ్యానర్ నుంచి కూడా కాల్ చేసి త్వరలోనే కలిసి ప్రాజెక్ట్ చేద్దామని అన్నారు. ప్రస్తుతం రామ్ ఆంద్ర కింగ్ తాలూకా సినిమాకి కామితా డిపార్ట్మెంట్ పని చేస్తున్నాను. ఇంకో రెండు సినిమాలకు కెమెరామెన్ గా చేస్తున్నాను అని తెలిపారు వళి.
Also Read : Priyadarshi : మొన్న బన్నీ వాసు.. ఇవాళ ప్రియదర్శి.. టార్గెట్ గా హేట్ చేస్తున్నారు.. చాలా బాధపడ్డాం..