Gopichand 31 : కన్నడ స్టార్ డైరెక్టర్‌తో గోపీచంద్ కొత్త సినిమా లాంచ్..

ఇటీవల కాలంలో ఒక పరిశ్రమలోని దర్శకులతో మరో పరిశ్రమలోని హీరోలు జత కట్టడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే మ్యాచో స్టార్ గోపీచంద్ తన 31వ సినిమాని శాండిల్‌వుడ్ డైరెక్టర్ హర్షతో చేయబోతున్నాడు. ఈ సినిమా ఇవాళ (మార్చి 3) పూజ కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అయ్యింది.

Gopichand 31 : కన్నడ స్టార్ డైరెక్టర్‌తో గోపీచంద్ కొత్త సినిమా లాంచ్..

Gopichand 31 movie with kannada star director harsha

Updated On : March 3, 2023 / 11:29 AM IST

Gopichand 31 : ఇటీవల కాలంలో ఒక పరిశ్రమలోని దర్శకులతో మరో పరిశ్రమలోని హీరోలు జత కట్టడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ధనుష్, శివకార్తికేయన్ లు సినిమాలు చేశారు, చేస్తున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో కూడా ఇతర ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్ తో చేతులు కలపబోతున్నాడు. మ్యాచో స్టార్ గోపీచంద్ తన 31వ సినిమాని శాండిల్‌వుడ్ డైరెక్టర్ హర్షతో చేయబోతున్నాడు. ఈ సినిమా ఇవాళ (మార్చి 3) పూజ కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అయ్యింది.

Gopichand RamaBanam : గోపీచంద్ మొదటి బాణం అదిరిపోయింది.. రామబాణం ఫస్ట్ లుక్ టీజర్..

కన్నడనాట శివరాజ్ కుమార్ తో బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన హర్ష.. ఇటీవల వేద సినిమాతో కూడా సూపర్ హిట్టుని అందుకున్నాడు. ఇప్పుడు ఈ మాస్ డైరెక్టర్ గోపీచంద్ తో జత కట్టడంతో ఈ మూవీ పై అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, జే స్వామి సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నాడు. గతంలో గోపీచంద్ పంతం సినిమా తెరకెక్కించిన శ్రీ సత్య సాయి ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ నెలలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందని కూడా తెలియజేశారు.

ఈ మూవీలో నటించే నటీనటులు వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా గోపీచంద్ ప్రస్తుతం రామబాణం సినిమాలో నటిస్తున్నాడు. గతంలో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్‌ తో కలిసి గోపీచంద్ చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్టు కొట్టాలని చూస్తున్నారు డైరెక్టర్ అండ్ హీరో. ఇటీవల ఈ మూవీ నుంచి మొదటి బాణం అంటూ ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ సినిమా పై అందరిలో ఆసక్తి రేకెత్తించింది. ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్ గా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.