Site icon 10TV Telugu

Gopichand : గోపీచంద్ చేస్తున్న మంచి పని.. కానీ ఎవ్వరికి తెలీదు.. ఎంతోమంది పిల్లలకు..

Gopichand shares Interesting Matter about him in Ali Tho Saradaga Programme

Gopichand shares Interesting Matter about him in Ali Tho Saradaga Programme

Gopichand : మ్యాచో స్టార్ గోపీచంద్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. త్వరలో భీమా(Bhimaa) సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనపడబోతున్నాడు. మాస్ సినిమాకి ఓ మైథలాజి కాన్సెప్ట్ కూడా జత చేశారు. ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం గోపీచంద్ భీమా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అలీతో సరదాగా ప్రోగ్రాంకి గెస్ట్ గా వచ్చాడు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నట్టు తెలుస్తుంది.

Also Read : Vishwak Sen : లేడీ గెటప్ వేయబోతున్న విశ్వక్ సేన్.. ఆ సినిమా కోసం..

అలీ.. నువ్వు కొంతమంది పిల్లల్ని చదివిస్తున్నావు. కానీ బయటకి ఎందుకు చెప్పవు అని గోపీచంద్ ని అడగగా దానికి గోపీచంద్ సమాధానమిస్తూ.. నాకు అలా చెప్పుకోవడం ఇష్టం ఉండదు. నేను చదివిస్తున్న పిల్లలకు కొంతమందికి నా పేరు కూడా తెలీదు. వాళ్ళు బాగా చదువుతున్నారా? చదువుకోడానికి డబ్బులు లేకపోతే నేను చదివిస్తా అంతే అంటూ గోపీచంద్ తెలిపాడు. దీంతో రీల్ హీరోనే కాదు గోపీచంద్ రియల్ హీరో అంటూ అభిమానులు, పలువురు కామెంట్స్ చేస్తూ అభినందిస్తున్నారు. ఇక గోపీచంద్ భీమా సినిమా మార్చ్ 8న రాబోతుంది.

Exit mobile version