Gossip Garage Prashanth Varma is the master plan for the movie Jai Hanuman
పాన్ ఇండియన్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్ మూవీ జై హనుమాన్. సూపర్ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్క్రీన్‌పై పెద్ద మ్యాజిక్ క్రియేట్ చేసి సూపర్ హిట్టు కొట్టాడు. ఆ సక్సెస్‌తో హనుమాన్ మూవీకి జై హనుమాన్ అంటూ సీక్వెల్ ప్రిపేర్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.
హనుమాన్ మూవీకి మించి వందరెట్లు భారీ స్థాయిలో జై హనుమాన్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్‌గా కనిపించబోతున్నాడు. ఈ మూవీపై తాజాగా ఓ బిగ్ గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేయబోతుందట.
కథ విషయానికి వస్తే.. ఇది సప్త చిరంజీవుల స్టోరీ అంటూ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. పురాణాల్లో హనుమంతుడు, అశ్వద్ధామ, బలి, కృపుడు, పరశురాముడు ఇలా ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. వాళ్లందరినీ ఈ సినిమాలో చూపించబోతున్నాడట ప్రశాంత్ వర్మ. దీంతో ఒక్కో పవర్‌ఫుల్ క్యారెక్టర్‌కు ఒక్కో స్టార్ హీరోని తీసుకురాబోతున్నారని ఇండస్ట్రీలో బిగ్ డిబెట్ పాయింట్‌గా మారింది.
హనుమంతుడు, అశ్వద్ధామ, పరశురాముడు పాత్రల కోసం పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోలను దింపనున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమైతే ఈ మూవీ బిగ్గెస్ట్ మల్టీస్టార్ మూవీగా నిలిచిపోనుంది.
Chiranjeevi – Anil Ravipudi : మెగా157 గ్యాంగ్ ఇదే.. క్యూట్ వీడియో చూశారా ?
ప్రస్తుతం జై హనుమాన్ మూవీకి స్క్రిప్ట్ వర్క్ ఫాస్ట్‌గా జరుగుతోంది. సెప్టెంబర్ నుంచి రిషబ్ శెట్టి జాయిన్ అవ్వబోతున్నాడంటున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు మేకర్స్. మొత్తానికి జైహనుమాన్ చిత్రం టాలీవుడ్ నుంచి మరో సెన్షన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసే అవకాశాలున్నాయంటూ ఇప్పటి నుంచే ప్రచారం ఊపందుకుంది.