Salman Khan : వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సల్మాన్ డబుల్ రోల్..?
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు.
Salman Khan plays a double role in Vamshi Paidipally film
Salman Khan : టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. దిల్‌రాజు బ్యానర్లో తెరకెక్కబోతున్న ఈ మూవీపై అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్లో నెక్స్ట్ లెవల్ హైప్ క్రియేట్ అయింది. అసలు ఎప్పుడెప్పుడు ఆ సినిమా పట్టాలెక్కుతుందా అని ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ గాసిప్స్ చక్కర్లు కొడుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్‌కు జోడిగా నయనతార యాక్ట్ చేయబోతున్నట్లు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. అయితే సల్లూ భాయ్ రోల్‌కు సంబంధించి ఇంకో లీక్ ఇంట్రెస్టింగ్గా మారింది.
సల్మాన్ ఖాన్ (Salman Khan ) డబుల్ రోల్లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఒక రోల్లో పూర్తి మాస్, పవర్ ఫుల్‌గా ఉండగా, మరొకటి క్లాస్.. ఎమోషనల్ షేడ్స్‌తో ఉండబోతోందట. ఇప్పటికే స్క్రిప్ట్‌లో ఈ రెండు పాత్రల మధ్య ఉన్న కాన్ ఫ్లిక్ట్ స్టోరీకి హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.
Payal Radhakrishna : పాపం ప్రతాప్.. వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ..
ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ ట్విస్ట్‌లు ఈ డబుల్ రోల్లో మరింత ఎలివేట్ అవుతాయని ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారట. సల్మాన్ ఖాన్ గతంలో కూడా డబుల్ రోల్లో మెప్పించినప్పటికీ, ఈ సారి పూర్తిగా కొత్త గెటప్స్, న్యూ స్టైల్‌తో ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేయబోతున్నాడట. సల్మాన్ డబుల్ రోల్‌పై అధికారికంగా క్లారిటీ రాకపోయినా, ఈ గాసిప్ మాత్రం మూవీపై అంచనాలను పెంచేస్తోంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్ మేకింగ్ స్టైల్, బాలీవుడ్ మాస్ క్రేజ్‌ను కలిపి సరికొత్త విజువల్ వండర్‌గా రాబోతోందట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారని ఇన్సైడ్ టాక్.
