Theaters Percentage War : థియేటర్స్ పర్సంటేజ్ వార్.. మరోసారి కార్యాచరణ ప్రిపేర్ చేసే పనిలో ఎగ్జిబిట్లరు!
సింగిల్ స్క్రీన్ థియేటర్ల చుట్టూ నడుస్తున్న (Theaters Percentage War ) చర్చ మళ్లీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తోంది.
Gossip Garage Tollywood Theaters Percentage War
Theaters Percentage War : సింగిల్ స్క్రీన్ థియేటర్ల చుట్టూ నడుస్తున్న చర్చ మళ్లీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తోంది. ఎప్పటినుంచో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఫిక్స్డ్ అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా నిర్మాత థియేటర్ యజమానికి అద్దె చెల్లించాలి. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, కరెంట్ బిల్లులు పెరిగిపోవడం వల్ల అద్దె విధానంతో నష్టపోతున్నామని, మల్టీప్లెక్స్‌లలో అమలవుతున్న పర్సెంటేజీ విధానాన్ని సింగిల్ స్క్రీన్లలోనూ కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎగ్జిబిటర్లు.
ఈ విషయంలో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు సమావేశమై డిస్కస్ కూడా చేశారు. అదే టైమ్‌లో పెద్ది మూవీ రిలీజ్ ఉండటంతో.. పర్సంటేజ్ గొడవకు షార్ట్ బ్రేక్ ఇచ్చారు. జూన్ 30లోపు సమస్యను పరిష్కరిస్తామని మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన హామీ ఉన్నప్పటికీ, ఇప్పటికీ అది ఒక కొలిక్కి రావడం లేదు. పైగా ఈ వివాదం తగ్గడం కంటే మరింత తీవ్రంగా మారుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 85శాతం నిర్మాతలకు, 15శాతం మాత్రమే ఎగ్జిబిటర్లకు ఇవ్వాలని ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే ఈ ప్రపోజల్‌ను ఎగ్జిబిటర్లు పూర్తిగా తిరస్కరించినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Ilaiyaraaja : ఢిల్లీ హైకోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ..
ఇటీవల విడుదలైన సింగితం, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమాలకు ఆశించిన స్థాయిలో టికెట్ సేల్స్ లేకపోవడం కూడా ఈ వివాదానికి మరింత బలం ఇచ్చింది. మరోవైపు సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమాకు మంచి వసూళ్లు రావడంతో, ఆ చిత్రానికి ఎగ్జిబిటర్లకు దాదాపు 45% ఇచ్చినట్టు టాక్ ఉంది. ఇదే విధంగా పెద్ద సినిమాలకూ సరైన షేర్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తుండగా, పెద్ద నిర్మాతలు మాత్రం 15శాతమే ఇస్తామని అంటున్నారట. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. చిరంజీవి హామీ ఇచ్చిన గడువు ముగిసినా సమస్యకు పరిష్కారం కనిపించకపోవడంతో మరోసారి కార్యాచరణ ప్రిపేర్ చేసే పనిలో బిజీగా ఉన్నారట ఎగ్జిబిట్లరు.
