HanuMan : గవర్నర్ తమిళిసైని కలిసిన తేజ సజ్జ.. హనుమాన్ సినిమాపై ప్రశంసలు

హనుమాన్ సినిమా రికార్డుల మోత మోగుతోంది. ఇండియాలోనే కాదు.. అమెరికాలో సైతం టాప్ హీరోల కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసేసింది. తాజాగా ఈ సినిమా హీరో తేజ సజ్జ తెలంగాణ గవర్నర్‌ని కలిశారు.

HanuMan

HanuMan : తేజ సజ్జ-ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ‘హనుమాన్’ వీర విహారం కొనసాగుతోంది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా రూ.150 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌‌ను హీరో తేజ సజ్జ కలిశారు. సినిమా టీమ్‌ను గవర్నర్ అభినందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

Gnaneswari Kandregula : ఆమెతోనే ప్రశాంత్ వర్మ సూపర్ హీరోయిన్ మూవీ.. ‘జై హనుమాన్’ తర్వాత?

హనుమాన్ హీరో తేజ సజ్జ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. కాసేపు గవర్నర్‌తో ముచ్చటించారు. అనంతరం గవర్నర్ తమిళిసై సినిమా సూపర్ హిట్ అయినందుకు అభినందనలు చెబుతూ తన సోషల్ మీడియా ఖాతాలో టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ‘దేశ వ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించినందుకు హనుమాన్ టీమ్‌కు అభినందనలు..ప్రశాంత్ వర్మ డైరెక్షన్ బాగుంది.. వాస్తవాన్ని తలపించేలా విజువల్స్ ఆకట్టుకున్నాయి. తేజ సజ్జ ఎంతో కాన్ఫిడెన్స్‌తో, నైపుణ్యంతో నటించారు’ అనే శీర్షికతో ఈ పోస్టు పెట్టారు.

HanuMan : హనుమాన్ సినిమా గురించి ప్రభాస్.. ఏంటి డార్లింగ్ టికెట్స్ దొరకడం లేదంటూ..

హనుమాన్ సినిమా భారత్‌లోనే కాదు అమెరికాలో కూడా రికార్డు స్ధాయిలో కలెక్షన్స్ సాధిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. గతంలో ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలు 3 మిలియన్ డాలర్స్‌పైన కలెక్షన్స్ రికార్డు చేస్తే హనుమాన్ 4M డాలర్స్ అందుకుని ఆ రికార్డుల్ని బ్రేక్ చేసేసింది. ఇంకా కలెక్షన్ల పరంపర కొనసాగుతూనే ఉంది.