Gunasekhar – Allu Arjun : అల్లు అర్జున్ కి నేను ఫ్లాప్ ఇచ్చినా నాకు ఫోన్ చేసి.. బాలయ్య షోలో బన్నీపై గుణశేఖర్ కామెంట్స్..
గుణశేఖర్ - అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన వరుడు సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

Gunasekhar Comments on Allu Arjun while Remembering about Rudramadevi Movie
Gunasekhar – Allu Arjun : తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి నాలుగో ఎపిసోడ్ లో అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు. అయితే అల్లు అర్జున్ గురించి రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, దిల్ రాజు, గుణశేఖర్ లతో మాట్లాడించి ఆ వీడియో బైట్స్ ని షోలో ప్లే చేసారు.
ఈ క్రమంలో గుణశేఖర్ మాట్లాడుతూ.. రుద్రమదేవి సమయంలో ఆయనే నాకు ఫోన్ చేసారు. నేను ఆయనకు ఫ్లాప్ ఇచ్చినా నాకు ఫోన్ చేసి మీ సినిమా కష్టాల్లో ఉందని విన్నాను, మీ సినిమాలో క్యారెక్టర్ నేను చేస్తాను, మీకు సపోర్ట్ అవుతుంది అని రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి క్యారెక్టర్ చేశాడు అని అన్నారు. గుణశేఖర్ – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన వరుడు సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రుద్రమదేవిలో గుణశేఖర్ దర్శకత్వంలో గోన గన్నారెడ్డి పాత్ర చేశాడు బన్నీ.
Also Read : Allu Arjun : నా ఆఫీస్‌లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఆయన ఫోటోనే కనిపిస్తుంది.. నా మనసులో ఆయనకు అంత స్థానం ఉంది..
ఇక దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ.. ఆయనతో చేసిన వరుడు సినిమా అంతగా ఆడలేదు. రిజల్ట్ ఎలా ఉన్నా ఆయన చాలా జెన్యూన్ గా పని చేస్తారు. ఆ రోజుల్లోనే ఆయన ఒక 30 కోట్లు పెట్టి రుద్రమదేవి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారని తెలిసింది. కానీ షూట్ అంతా పూర్తిచేసి అందులో ఓ క్యారెక్టర్ కోసం హీరోని వెతుకుతున్నారు. ఆయన అప్పటికే ఫైనాన్షియల్ కష్టాల్లో ఉన్నారని తెలిసింది. దీంతో నేనే ఆయనకు ఫోన్ చేసి ఆ క్యారెక్టర్ నేను చేస్తాను అని చెప్పి ఆ సినిమాకు వర్క్ చేశాను అని తెలిపారు.
ఇక రుద్రమదేవి సినిమాకు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే చేసారని గతంలోనే గుణశేఖర్ తెలిపారు. మరోసారి అల్లు అర్జున్ గొప్పతనం గురించి చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా అభిమానులు, నెటిజన్లు అల్లు అర్జున్ ని అభినందిస్తున్నారు.