Meenakshi Chaudhary
Meenakshi Chaudhary : మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ రిలీజ్‌కి దగ్గర పడుతోంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. లంగావోణీలో మహేష్ బాబు భుజాలపై చేతులు వేసి నిల్చున్న మీనాక్షి లుక్ అదిరిపోయింది.
Guntur Kaaram : గుంటూరు కారం సూపర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రైలర్ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది..
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉంది మూవీ టీమ్. వరసగా సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. జనవరి 6 న ట్రైలర్, ప్రీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసారు. ఈ ఈవెంట్‌ని అమెరికా థియేటర్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇవ్వబోతున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రని పరిచయం చేస్తూ మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. లంగా వోణీలో క్యూట్‌గా ఉన్న మీనాక్షి మహేష్ బాబు భుజాలపై చేతులు వేసుకుని నిలబడి ఉంది. ఈ సినిమాలో ‘రాజీ’ పాత్రలో మీనాక్షిని పరిచయం చేస్తూ మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంది.
Mahesh Babu : 100లో 90 థియేటర్లు మహేష్ బాబుకే.. సంక్రాంతికి గుంటూరు కారం ఘాటు.. ఓపెనింగ్స్ ఎంత?
కాగా ఈ సినిమాలో మహేష్ బాబు-మీనాక్షి చౌదరి మధ్య వచ్చే సీన్స్ హైలైట్ కాబోతున్నాయట. రొమాంటిక్‌గా, టీజింగ్ ఉంటాయని తెలుస్తోంది. గుంటూరు కారంలో మరో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం కీలక పాత్రలు చేస్తున్నారు. హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.
Here’s introducing our @meenakshiioffl as ‘Raji’ from #GunturKaaram ?❤️?
? ???? to go… Worldwide Grand Release at theatres near you on JAN 12th! ??
Super? @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14 @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine… pic.twitter.com/WUC4rxR8W2
— Haarika & Hassine Creations (@haarikahassine) January 4, 2024