Guntur Kaaram : గుంటూరు కారం సూపర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రైలర్ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది..

గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్ అయ్యింది. ఎప్పుడు.. ఎక్కడ..?

Guntur Kaaram : గుంటూరు కారం సూపర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రైలర్ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది..

Mahesh Babu Guntur Kaaram trailer release and pre release event details

Updated On : January 3, 2024 / 7:07 PM IST

Guntur Kaaram : ఇన్నాళ్లు ఊరించిన మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ మరో కొన్ని రోజుల్లో ఆడియన్స్ ముందుకు వచ్చేబోతుంది. మూవీ టీం ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చూసుకుంటూనే, మరోపక్క ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తూ వస్తుంది. ఈక్రమంలోనే మూవీ నుంచి సాంగ్స్ వరుసగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్ అయ్యింది.

ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఒకేరోజు నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ లోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. జనవరి 6 శనివారం నాడు ఈ ఈవెంట్ జరగబోతుంది. ఆ ఈవెంట్ లోనే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మహేష్ బాబు మరో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికా థియేటర్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నారట.

Also read : Salaar vs Dunki : 12 రోజులకు సలార్, డంకీ కలెక్షన్స్..? రెండిటి మధ్య తేడా ఎంత..?

కాలిఫోర్నియా సినీ లాంజ్ ఫ్రీమాంట్ సెవెన్ సినిమాస్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ చేయబోతున్నారు. ఇలా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో లైవ్ ఇవ్వడం ఇదే మొదటిసారి. దీంతో మహేష్ బాబు మరో కొత్త ట్రెండ్ ని సెట్ చేసి.. ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంటున్నారు. గతంలో టీజర్, గ్లింప్స్, మోషన్ పోస్టర్, రీ రిలీజ్.. ఇలా చాలా ట్రెండ్స్ ని మహేషే స్టార్ట్ చేశారు.

ఇక గుంటూరు కారం ముచ్చట్లు విషయానికి వస్తే.. ఇంటర్వెల్ సీన్ లో మహేష్ బాబు అందర్నీ ఎమోషనల్ చేసేస్తారని, ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ లో సూపర్ స్టార్ కృష్ణని కూడా ఆడియన్స్ ఫీల్ అవుతారని, సినిమాలోని లాస్ట్ 45 నిమిషాలు.. ఫైట్స్, సాంగ్స్, ఎమోషన్స్ తో సూపర్ గా ఉంటుందని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు. అలాగే మంచి కామెడీ కూడా ఉంటుందని పేర్కొన్నారు.