Rashmika Mandanna : రష్మికను బ్యాన్ చెయ్యాలి.. గుర్తుందా శీతాకాలం దర్శకుడు స్పందన..

గత కొన్ని రోజులుగా కన్నడ సినీపరిశ్రమలో స్టార్ హీరోయిన్ 'రష్మిక మందన'ను బ్యాన్ చేశామంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై 'గుర్తుందా శీతాకాలం' దర్శకుడు నాగశేఖర్ స్పందించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలో రష్మిక బ్యాన్ గురించి ప్రశ్నించగా..

Rashmika Mandanna : రష్మికను బ్యాన్ చెయ్యాలి.. గుర్తుందా శీతాకాలం దర్శకుడు స్పందన..

Gurthunda Seethakalam Director Comments on Rashmika Ban in Kannada

Updated On : November 30, 2022 / 8:02 PM IST

Rashmika Mandanna : గత కొన్ని రోజులుగా కన్నడ సినీపరిశ్రమలో స్టార్ హీరోయిన్ ‘రష్మిక మందన’ను బ్యాన్ చేశామంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల రష్మిక బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూతో ఈ గొడవ మొదలయింది. ఆ ఇంటర్వ్యూలో తనకి మొదటిగా హీరోయిన్ ఛాన్స్ ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు మరియు దర్శకుడు రిషబ్ శెట్టి గురించి ప్రస్తావించడానికి కూడా ఇష్ట పడలేదు.

Rashmika Mandanna: మహేష్ సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్న స్టార్ బ్యూటీ.. నిజమేనా?

దీంతో కన్నడిగులు కోపానికి గురైంది ఈ భామ. తాజాగా ఈ విషయంపై ‘గుర్తుందా శీతాకాలం’ దర్శకుడు నాగశేఖర్ స్పందించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలో రష్మిక బ్యాన్ గురించి ప్రశ్నించగా.. “ఒకరు మన వల్లే ఎదిగారని, వాళ్ల నుంచి కృతజ్ఞత భావం కోరుకోవడం మన తప్పు అవుతుంది. నిజాన్ని గుర్తుపెట్టుకుంటారా? లేదా? అనేది వాళ్ల వ్యక్తిగతం. అయిన ఒక నటిని బ్యాన్ చేయడం వల్ల నష్టపోయేది ఆ పరిశ్రమే” అంటూ బదులిచ్చాడు.

కాగా ఎన్నోసారులు వాయిదాలు తరువాత, ఈ డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది ‘గుర్తుందా శీతాకాలం’. ఈ సినిమా కన్నడ చిత్రం ‘లవ్ మాక్ టైల్’కు రీమేక్ గా వస్తుంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో విలక్షణ నటుడు సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి తనయుడు కాళభైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.