Hansika Motwani : డేట్ కి రమ్మంటూ ఆ హీరో నన్ను బాగా ఇబ్బందిపెట్టాడు.. హన్సిక ఆ వ్యాఖ్యలు చేయలేదా?
తాజాగా బాలీవుడ్ లో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన హన్సిక టాలీవుడ్ గురించి మాట్లాడింది. టాలీవుడ్ హీరోల గురించి, హీరోయిన్స్ గురించి, ఇక్కడ సినిమాల గురించి మాట్లాడింది.

Hansika Motwani sensational comments on Tollywood Hero
Hansika : చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో పలు సినిమాలు, సీరియల్స్ చేసిన హన్సిక తెలుగు దేశముదురు(Deshamuduru) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 16 ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అప్పుడే దాదాపు 50 సినిమాలు చేసేసింది. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన హన్సిక మధ్యలో ఓ మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉంది. గత సంవత్సరం ముంబై(Mumbai)కి చెందిన వ్యాపారవేత్త సోహైల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది హన్సిక.
పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది హన్సిక. ఇప్పుడు హన్సిక చేతిలో దాదాపు అరడజను సినిమాలు, కొన్ని సిరీస్ లు ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ లో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన హన్సిక టాలీవుడ్ గురించి మాట్లాడింది. టాలీవుడ్ హీరోల గురించి, హీరోయిన్స్ గురించి, ఇక్కడ సినిమాల గురించి మాట్లాడింది.
అయితే ఇదే ఇంటర్వ్యూలో హన్సిక.. టాలీవుడ్ లో ఓ హీరో నన్ను బాగా ఇబ్బందిపెట్టాడు. రోజూ డేట్ కి రమ్మని అడుగుతూ, డేట్ కి వస్తావా అంటూ ఫోన్స్, మెసేజ్ లతో విసిగించాడు. అయితే ఆ హీరోకి మాత్రం తగిన బుద్ధి చెప్పాను అని తెలిపినట్టు వార్తలు వచ్చాయి. హన్సిక ఈ వ్యాఖ్యలు చేసిందని వైరల్ గా మారాయి. అయితే దీనిపై హన్సిక తాజాగా ట్వీట్ చేసింది. నిన్నటి నుంచి వస్తున్న ఈ వార్తలపై హన్సిక స్పందిస్తూ.. ఇలాంటివి రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఆ కామెంట్స్ చేయలేదు. ఇలాంటివి పబ్లిష్ చేసేముందు చెక్ చేసుకోండి అని ట్వీట్ చేసింది.
Publications urging you to cross check before picking up random news piece ! Never made this comment that's doing the rounds pls fact check before publishing blindly .
— Hansika (@ihansika) May 23, 2023