Soheal Kathuriya : హీరోయిన్ పేరు టాటూ వేయించుకున్న భర్త..

హన్సిక సోహెల్ తో జరిగిన తన పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో తీసి ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్ స్టార్ కి ఇచ్చింది. హన్సిక లవ్ షాదీ డ్రామా పేరుతో హన్సిక పెళ్లి డాక్యుమెంటరీ ప్రస్తుతం డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.............

Soheal Kathuriya : హీరోయిన్ పేరు టాటూ వేయించుకున్న భర్త..

Hansika's husband Sohel Kathuria got Hansika's name tattooed on his left arm

Updated On : February 24, 2023 / 7:03 AM IST

Soheal Kathuriya :  చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో సినిమాలు చేసి 16 ఏళ్లకే తెలుగులో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక. తెలుగులో దేశముదురు, మస్కా, కందిరీగ, బిల్లా, పవర్.. ఇలా అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తమిళ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసింది హన్సిక. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి 19 ఏళ్ళు అవుతున్నా ఇంకా వరుస సినిమాలు చేస్తోంది హన్సిక. ప్రస్తుతం హన్సిక చేతిలో దాదాపు అరడజను తెలుగు, తమిళ్ సినిమాలు ఉన్నాయి.

ఇక హన్సిక ఇటీవలే సోహెల్ కతూరియా అనే ఓ బిజినెస్ మెన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనికి ఇది రెండవ పెళ్లి. అందులోనూ సోహెల్ మొదటి భార్య హన్సిక స్నేహితురాలు కావడం విశేషం. సోహెల్, హన్సిక ఇటీవలే పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కొంతమంది సెలబ్రిటీలు తమ పెళ్లి వీడియోల్ని, తమ పెళ్లి జర్నీని డాక్యుమెంటరీగా తీసి ఓటీటీలకు అమ్ముకుంటున్నాయి. దీంతో ఇటు డబ్బుతో పాటు అటు ప్రమోషన్ కూడా వస్తోంది. హన్సిక కూడా ఇదే చేసింది. హన్సిక సోహెల్ తో జరిగిన తన పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో తీసి ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్ స్టార్ కి ఇచ్చింది. హన్సిక లవ్ షాదీ డ్రామా పేరుతో హన్సిక పెళ్లి డాక్యుమెంటరీ ప్రస్తుతం డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.

Ilaiyaraaja : సంగీత ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మ్యాస్ట్రో ఇళయరాజా లైవ్‌ కాన్సర్ట్‌..

ఈ డాక్యుమెంటరీలో హన్సిక, ఆమె భర్త సోహెల్ అనేక విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే పెళ్ళికి ముందే సోహెల్ హన్సిక పేరుని ఎడమ చేతిమీద హిందీలో హన్సిక అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. పచ్చబొట్టు వేయించుకునేటప్పుడు హన్సికకి వీడియో కాల్ చేయగా అది చూసి హన్సిక షాక్ అయి ఎమోషనల్ అయింది. దీంతో పలువురు సోహెల్ కి హన్సిక అంటే ఎంత ప్రేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by StarPlus (@starplus)