బాలయ్య అభిమానులకు అసలైన దీపావళి కానుక

దీపావళి నాడు ‘రూలర్’ మూవీ నుంచి బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ ‘ధర్మ’గా కనిపించనున్న న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు..

  • Published By: sekhar ,Published On : October 27, 2019 / 07:21 AM IST
బాలయ్య అభిమానులకు అసలైన దీపావళి కానుక

Updated On : October 27, 2019 / 7:21 AM IST

దీపావళి నాడు ‘రూలర్’ మూవీ నుంచి బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ ‘ధర్మ’గా కనిపించనున్న న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు..

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న105వ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ కన్ఫమ్ చేస్తూ.. ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో, సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

దీపావళి నాడు బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ ‘ధర్మ’గా కనిపించనున్న న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. బాలయ్య గెటప్ అండ్ లుక్ వైజ్ బాగున్నాడు. ‘పోలీస్ గెటప్‌లో బాలయ్య లుక్ కిరాక్.. ఇదీ మాకు అసలైన దీపావళి కానుక’ అంటూ నందమూరి అభిమానులు ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు.

Read Also : విష్ణు మంచు దివాళీ పార్టీలో ప్రభాస్

‘రూలర్’ మోషన్ పోస్టర్ వీడియాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.. చిరంతన్ భట్ కంపోజ్ చేసిన మ్యూజిక్, హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ రాసిన లిరిక్స్ చక్కగా సెట్ అయ్యాయి ఈ వీడియోలో.. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 20న ‘రూలర్’ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.