Happy Wedding Anniversary

  • Published By: sekhar ,Published On : October 6, 2020 / 02:16 PM IST
Happy Wedding Anniversary

Updated On : October 6, 2020 / 3:56 PM IST

Chai Akkineni Samantha Wedding anniversary: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నాగార్జున నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్‌లో సినిమా సినిమాకు వైవిధ్యం కనబరుస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా స్టార్ హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకున్నాడు.


అక్కినేని వారి కోడలిగా మారిపోయిన సమంత.. వివాహం తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తూ వరుస విజయాలు అందుకుంటోంది. మరోవైపు బిజినెస్ ఉమెన్‌గానూ రాణించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. నేటితో చై, సామ్ వివాహం జరిగి ముచ్చటగా మూడేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా తన భర్త నాగచైతన్యకు సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విషెస్ చెప్పింది.


‘‘నువ్వు పూర్తిగా నా మనిషివి. అలాగే నేను నీదానిని. మనం ఏ ద్వారం వద్దకు వచ్చినా.. ఇద్దరం కలిసే దానిని తెరుస్తాం. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు Husband నాగ చైతన్య..’’ అంటూ ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేసింది సమంత. ఉపాసన, రానా దగ్గుబాటితో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అక్కినేని యువజంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

https://www.instagram.com/p/CF_MKk0hj6P/?utm_source=ig_web_copy_link