Hari Hara Veera Mallu : ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ నుంచి సూప‌ర్ అప్‌డేట్‌.. షూటింగ్‌లో ప‌వ‌న్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ న‌టిస్తున్న సినిమాల్లో ‘హరి హర వీర మల్లు’ ఒక‌టి.

Hari Hara Veera Mallu : ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ నుంచి సూప‌ర్ అప్‌డేట్‌.. షూటింగ్‌లో ప‌వ‌న్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే?

HariHaraVeeraMallu shoot resumes on 23rd September with a massive action sequence

Updated On : September 20, 2024 / 12:53 PM IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ న‌టిస్తున్న సినిమాల్లో ‘హరి హర వీర మల్లు’ ఒక‌టి. జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ మూవీ నుంచి తాజాగా చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. సెప్టెంబ‌ర్ 23 నుంచి భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ ను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలిపింది.

హాలీవుడ్ లెజెండ్ నిక్ పావెల్ స్టంట్ డైరెక్షన్‌లో ఈ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను చిత్రీక‌రించ‌నున్నామ‌ని, ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం పాల్గొంటార‌ని తెలిపింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. మూవీలోని ప‌వ‌న్ గెట‌ప్ సంబంధించిన కొత్త ఫోటోను పోస్ట్ చేసింది.

Bigg Boss 8 : కంట‌త‌డి పెట్టుకున్న మ‌ణికంఠ‌.. గెట్ అవుట్ అంటూ గేట్లు ఓపెన్ చేసిన బిగ్‌బాస్‌

ఎన్నిక‌లు, రాజ‌కీయాల కార‌ణంగా కొంత‌కాలం పాటు సినిమా షూటింగ్‌ల‌కు ప‌వ‌న్ దూరంగా ఉన్నారు. తాజాగా చిత్ర బృందం అప్‌డేట్‌తో ప‌వ‌న్ ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. దీంతో ప‌వ‌న్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

లెజెండరీ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. 17వ శ‌తాబ్దం నేప‌థ్యంలో సాగే ఈ మూవీని రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. తొలి భాగాన్ని స్వార్డ్ వ‌ర్సెస్ స్పిరిట్ పేరుతో విడుద‌ల చేయ‌నున్నారు. ధ‌ర్మం కోసం యుద్ధం అనేది ఉప‌శీర్షిక‌.

Jani Master : ర‌హ‌స్య ప్ర‌దేశంలో జానీ మాస్ట‌ర్‌ను విచారిస్తున్న పోలీసులు!