Harish shankar: నిజం ఒప్పుకున్న హరీష్ శంకర్.. ‘ఉస్తాద్’ పరాజయంపై ఓపెన్ కామెంట్స్
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పరాజయంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన హరీష్ శంకర్(Harish shankar).
Harish Shankar shocking comments on Ustaad Bhagat Singh flop
- ఉస్తాద్ ప్లాప్ పై హరీష్ కామెంట్స్
- పాపం హరీష్ అనడంతో వైరల్
- రియాలిటీలోకి వచ్చేసిన హరీష్ శంకర్
Harish shankar: సినిమా ఫలితం కాస్త తేడాగా వచ్చినప్పుడు ఆ నిజాన్ని అంగీకరించే దర్శకులు పరిశ్రమలో చాలా తక్కువ మంది ఉంటారు. ఈ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ తన నిజాయితీని చాటుకున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదనే నిజాన్ని ఆయన పరోక్షంగా అంగీకరించారు. రీసెంట్ గా ఓ సినిమా పాల్గొన్న ఆయన, సినిమా ఫలితం పట్ల తన రియలైజేషన్‌ను బయటపెట్టడం విశేషం. ఉస్తాద్ భగత్ సింగ్ అనుకున్నంత ఆడలేదని, అందుకే తనను పాపం హరీష్ అని యాంకర్ పిలిచినట్టుగా పొరపాటు పడ్డానని ఆయన అన్నారు.
Mrunal Thakur: మీరు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే కాదు.. స్నేహితులతో స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన మృణాల్
సాధారణంగా ప్లాప్ అయిన సినిమాను కూడా సమర్థించుకునే దర్శకుల మధ్య, హరీష్ ఇలా వాస్తవానికి దగ్గరగా మాట్లాడటం మెచ్చుకోదగ్గ పరిణామం. ఈ సినిమా ప్రమోషన్ల కోసం హరీష్ శంకర్(Harish shankar) ఒక్కరే చాలా శ్రమించారు. హీరోయిన్స్ శ్రీలీల, రాశీ ఖన్నాలను వెంటబెట్టుకుని వారం రోజుల పాటు విపరీతంగా పబ్లిసిటీ చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతల్లో బిజీగా ఉన్నప్పటికీ, హరీష్ మాత్రం బాధ్యతగా అభిమానులను కలుస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లారు. అయితే, మార్చి 19న విడుదలైన ఈ చిత్రం నెల తిరక్కుండానే ఏప్రిల్ 16న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రావడం గమనార్హం. ఐదు వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని నిర్మాతలు చెప్పినప్పటికీ, థియేటర్ ఫలితం వల్ల డిజిటల్ విడుదల త్వరగా జరిగిపోయింది.
హరీష్ శంకర్ కెరీర్ పరంగా ఇది వరుసగా రెండో ఫెయిల్యూర్ కావడం గమనార్హం. గడిచిన ఎనిమిదేళ్లలో ఆయనకు ‘గద్దలకొండ గణేష్’ మాత్రమే సరైన విజయాన్ని అందించింది. తన సినీ ప్రయాణంపై స్పందిస్తూ, తాను తీసిన సినిమాల కంటే ఆగిపోయిన సినిమాలే ఎక్కువని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు పంతొమ్మిది సినిమాలు ముహూర్తం దాకా వచ్చి క్యాన్సిల్ అయ్యాయని తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రోలింగ్‌కు దూరంగా ఉన్నప్పటికీ, సరైన సక్సెస్ కోసం ఈ మాస్ డైరెక్టర్ గట్టి ప్రయత్నమే చేయాల్సి ఉంది.
