Harish Shankar: తమిళ హీరోతో హరీష్ శంకర్ మూవీ.. లేనట్టేనా..?

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకోవాలని హరీష్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక పవన్‌తో ఈ సినిమాను పూర్తి చేయాలంటే సమయం పడుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుండగా, హరీష్ ఈలోగా మరో హీరోతో సినిమాను చేస్తాడనే వార్త జోరుగా వినిపిస్తోంది.

Harish Shankar: తమిళ హీరోతో హరీష్ శంకర్ మూవీ.. లేనట్టేనా..?

Harish Shankar Sivakarthikeyan Movie Only Rumours

Updated On : December 29, 2022 / 8:36 PM IST

Harish Shankar: టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకోవాలని హరీష్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక పవన్‌తో ఈ సినిమాను పూర్తి చేయాలంటే సమయం పడుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుండగా, హరీష్ ఈలోగా మరో హీరోతో సినిమాను చేస్తాడనే వార్త జోరుగా వినిపిస్తోంది.

Harish Shankar : హరిష్ శంకర్ కి పవన్ ఫ్యాన్స్ సూసైడ్ నోట్..

తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ డాన్, ప్రిన్స్ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి ఫేం సాధించాడు. ఇక ఈ హీరోతో హరీష్ శంకర్ త్వరలోనే ఓ సినిమాను తెరకెక్కిస్తాడని.. ఇప్పటికే ఈ హీరోతో దీనికి సంబంధించిన సంప్రదింపులు జరిపాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. అందుకే శివకార్తికేయన్ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. శివకార్తికేయన్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉండగా, హరీష్ శంకర్ మాత్రం కేవలం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’పైనే ఫోకస్ పెట్టాడట. దీనికి సంబంధించిన స్క్రిప్టు పనుల్లో ఆయన ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభించాలని హరీష్ ఫిక్స్ అయ్యాడట. మొత్తానికి శివకార్తికేయన్‌తో హరీష్ సినిమా అనేది కేవలం పుకారుగానే మిగిలిపోయింది.