అందుకే సిగరెట్స్ కాల్చా.. నా DOB 24/02/1992..
Instagram Liveలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు అదిరిపోయే ఆన్సర్స్ ఇచ్చిన హరితేజ..

Instagram Liveలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు అదిరిపోయే ఆన్సర్స్ ఇచ్చిన హరితేజ..
హరితేజ.. చూడగానే ఆకట్టుకునే రూపంతో పాటు టాలెంటెడ్ యాంకర్ అండ్ యాక్ట్రెస్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘అ ఆ’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘హిట్’ ఇలా పలు సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కాసేపు ముచ్చటించింది హరితేజ. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చి ఆశ్చర్యపరిచింది.
అక్కా ‘హిట్’ మూవీలో మీరు నిజంగానే సిగరెట్ తాగారా అని అడగ్గా.. హరితేజ నిజమేనని చెప్పింది. పాత్ర డిమాండ్ చేసిందని.. అందువల్ల స్మోక్ చేయాల్సివచ్చిందని అంది. ఆమె వయసు గురించి ప్రశ్నించగా.. ‘చెప్తే ఎవరూ నమ్మరు. నమ్మినా వినరు. విన్నా అర్థం చేసుకోరు. నిజాలు నిష్టూరమే ఎప్పుడూ.. అయినా చెప్తా.. 24/02/1992’ అని హరితేజ తన పుట్టిన తేదీ వెల్లడించింది. అలాగే అభిమానుల కోరిక మేరకు ఒకట్రెండు పాటలు కూడా పాడి అలరించింది. ‘బిగ్‌బాస్’ ఫస్ట్ సీజన్‌లో పార్టిసిపేట్ చేసిన తర్వాత తన క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.