Bigg Boss 9 Telugu: వైల్డ్ గా మారుతున్న వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్.. చిరాకు తెప్పిస్తున్న మాధురి.. ఈవారం డేంజర్ జోన్ లో ఫోక్ సింగర్..
బిగ్ బాస్ సీజన్ 9.. ఇది చదరంగం కాదు రణరంగం అంటూ ప్రచారం చేశారు. (Bigg Boss 9 Telugu)కానీ, ఇంతకాలం ఎక్కడ కూడా ఆ రణరంగం కనిపించలేదు. ఆడియన్స్ అయితే అదే ఫీల్ అయ్యారు.

tanuja tops bigg boss season 9 voting ramu rathod in danger zone
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9.. ఇది చదరంగం కాదు రణరంగం అంటూ ప్రచారం చేశారు. కానీ, ఇంతకాలం ఎక్కడ కూడా ఆ రణరంగం కనిపించలేదు. ఆడియన్స్ అయితే అదే ఫీల్ అయ్యారు. ఎదో మిస్ అయ్యింది అని. అది గమనించిన బిగ్ బాస్ టీం వైల్డ్ గా ఉండే కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు రూపంలో లోపలికి పంపించారు. అసలు కథ ఈవారం నుంచి మొదలయింది. ఇప్పుడు నిజంగా బిగ్ బాస్ సీజన్ 9 రణరంగంలా మారింది. గత ఆదివారం(Bigg Boss 9 Telugu) ఆరుగురు సభ్యులు ఇంట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. వారిలో, దివ్వల మాధురి, అయేషా జీనత్, శ్రీనివాస్ సాయి, రమ్య మోక్ష, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా ఉన్నారు.
అయితే, బిగ్ బాస్ వీళ్లకి ముందే హిట్ ఇచ్చి పంపాడా లేక వాళ్లే ఆలా బిహేవ్ చేస్తున్నారా తెలియడం లేదు. కానీ, క్షణక్షణం రణరంగంగా మారుతోంది బిగ్ బాస్ హౌస్. మరీ ముఖ్యంగా మాధురి, జీనత్ గురించి చెప్పుకోవాలి. నామినేషన్స్ లో ఒక ఆట ఆడుకుకున్న జీనత్ కంటెస్టెంట్స్ ఆలోచన తీరునే మార్చేసింది. ఇక దివ్వెల మాధురి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతీ విషయానికి ఆర్గ్యూమెంట్స్ చేస్తూ గొడవ గొడవ చేస్తోంది. రాగానే శ్రీజతో గొడవ, తరువాత రాము రాథోడ్ తో, ఆ తరువాత కళ్యాణ్ తో, ఆ తరువాత దివ్యతో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు అందరితో గొడవలు పెట్టుకుంటూ బిగ్ బాస్ కి మంచి కంటెంట్ ఇస్తున్నారు.
అయితే, ఆడియన్స్ మాత్రం దివ్వెల మాధురి గొడవలను సీరియస్ గా తీసుకోవడం లేదు. ఎదో కంటెంట్ కోసం కావాలని చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆమె మాటలు చాలా చిరాకు తేప్పిస్తున్నాయ్ అంటున్నారు. ఇలా ప్రతీదానికి గొడవలు పడితే ముందు సాగడం చాలా కష్టం అని, నెక్స్ట్ వీక్ ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈవారం ఎలిమినేషన్ విషయానికి వస్తే.. నామినేషన్స్ లో దివ్య నిఖిత, రాము రాథోడ్, భరణి, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, తనూజ ఉన్నారు. వారిలో తనూజ, సుమన్ శెట్టి, భరణి, డెమోన్ పవన్ సేఫ్ జోన్ లో ఉండగా.. దివ్య, రాము రాథోడ్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ఇద్దరికి ఓటింగ్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈవారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.