Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కొత్త వీడియో వచ్చింది చూశారా?
ప్రభాస్ రెండు ఎపిసోడ్ లు చూసిన అభిమానులు.. వింటేజ్ ప్రభాస్ ని చూసేసాం అనుకుంటున్నారు. కానీ ఆహా టీం మాత్రమే అప్పుడే అయ్యిపోలేదు, ఇంకా ఉంది అంటుంది. ఇప్పటివరకు ఎప్పుడు చూడని ప్రభాస్ మరో కోణాన్ని చూడడానికి సిద్ధంగా ఉండండి. డార్లింగ్ ఎపిసోడ్ బిటిఎస్ వీడియోని రిలీజ్ చేయబోతున్నట్లు షో నిర్వాహకులు ఇటీవల ప్రకటించారు. తాజాగా..

Have you seen the new video of Prabhas Unstoppable episode?
Prabhas : ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహాలో ప్రసారం అవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో అన్‌స్టాపబుల్ గా దూసుకుపోతుంది. ఈ షో సెకండ్ సీజన్ కి తెలుగు రాష్ట్రాల్లో వివరితమైన రీచ్ లభించింది. గ్రేట్ స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తిలను, కాంట్రవర్సి పర్సన్స్ ని తీసుకు వస్తూ.. బాలయ్య వారిలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు తనదైన రీతిలో చూపించడంతో ఈ టాక్ షోకి బ్రహ్మరధం పడుతున్నారు. దీంతో ఇండియాలోనే ఈ షో ‘బాప్ అఫ్ ఆల్ టాక్ షోస్’ అనిపించుకుంటుంది. ఇక ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్ కి వచ్చిన పాపులారిటీ గురించి చెప్పనవసరం లేదు.
Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కి మరో క్రేజీ న్యూస్ చెప్పిన ఆహా..
సిల్వర్ స్క్రీన్ బాహుబలి ఎపిసోడ్ ని రెండ్లు బాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి ఫుల్ కిక్ ఇచ్చారు ఆహా టీం. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ మిస్ అవుతున్న డార్లింగ్ ప్రభాస్ ని మళ్ళీ బాలయ్య చూపించడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఒకప్పటి ప్రభాస్ లోని అల్లరి, చిలిపితనం ఈ ఎపిసోడ్స్ లో కనిపించడంతో ప్రేక్షకులకు కన్నుల విందుగా అనిపించింది. ఇక ఈ రెండు ఎపిసోడ్ లు చూసిన అభిమానులు.. వింటేజ్ ప్రభాస్ ని చూసేసాం అనుకుంటున్నారు. కానీ ఆహా టీం మాత్రమే అప్పుడే అయ్యిపోలేదు, ఇంకా ఉంది అంటుంది.
ఇప్పటివరకు ఎప్పుడు చూడని ప్రభాస్ మరో కోణాన్ని చూడడానికి సిద్ధంగా ఉండండి. డార్లింగ్ ఎపిసోడ్ బిటిఎస్ వీడియోని రిలీజ్ చేయబోతున్నట్లు షో నిర్వాహకులు ఇటీవల ప్రకటించారు. తాజాగా అందుకు సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు. దీనిలో బాలకృష్ణ, ప్రభాస్ తో మాట్లాడుతూ.. ‘మీట్ ది రియల్ సైడ్ అఫ్ బాలకృష్ణ’ అంటూ పరిచయం చేసుకున్నాడు. ‘అయ్యో నాకు తెలుసు సార్’ అంటూ ప్రభాస్ బదులిచ్చాడు. అలాగే ఆహా టీం తనకి ఇంకో కుటుంబం అంటూ ప్రభాస్ కి చెప్పుకొచ్చాడు బాలయ్య. కెమెరా వెనకాల బాలకృష్ణ, ప్రభాస్ చేసిన అల్లరిని కూడా ఈ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చారు షో నిర్వాహకులు. మరి ఆ వీడియో మీరు చూసి ఎంజాయ్ చేయండి.
Meeru choosina #PrabhasOnAHA allariki inka koncham extra kick ? Behind the scenes of #UnstoppableWithNBKS2 is here for you..
Bahubali Episode part 1&2 Streaming now on aha…@YoursGopichand #NBKOnAHA #NandamuriBalakrishna pic.twitter.com/spbpkbs44g— ahavideoin (@ahavideoIN) January 8, 2023