Naatu Naatu Song Lyrics : పోట్ల గిత్త.. పోతరాజు..! నాటు నాటు పాట లిరిక్స్ ఇవే!

దూకుడు, స్పీడు ఇలా.. వారి స్పెషాలిటీని చెప్పేందుకు చంద్రబోస్ తెలంగాణ, ఆంధ్ర జానపద, పల్లె, ఊర మాస్ పదాలను కలిపి వాడారు....................

Naatu Naatu Song Lyrics : పోట్ల గిత్త.. పోతరాజు..! నాటు నాటు పాట లిరిక్స్ ఇవే!

Naatu Naatu Song Lyrics

Updated On : November 10, 2021 / 4:20 PM IST

Naatu Naatu Song lyrics : ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రిలీజ్ కు రెడీ అవుతున్న RRR మూవీలోని నాటు నాటు పాట లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. ఇప్పటికే తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో ఈ పాట దుమ్ములేపుతోంది. ముఖ్యంగా తెలుగులో అయితే సందడి చెప్పనక్కర్లేదు. హీరోల స్టెప్పులు, రాజమౌళి టేకింగ్, కీరవాణి మ్యూజిక్, చంద్రబోస్ సాహిత్యం కారణంగా… పాట బుల్లెట్ వేగంతో ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది.

Naatu Naatu Song : దుమ్ములేపి దమ్ము చూపిన డాన్సర్లు.. చెర్రీ, NTR ఫ్యాన్స్‌కు అసలైన దీపావళి

ఓ హీరో ఆంధ్రా ప్రాంతానికి.. మరో హీరో తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు కావడంతో రైటర్ చంద్రబోస్ అవే పదాలతో పాట రాశారు. రెండు ప్రాంతాల్లోనూ ఉన్న ఊర మాస్ పదాలతో..  హీరోల ఆటిట్యూడ్, లక్షణాలు, దూకుడు, స్పీడు ఇలా.. వారి స్పెషాలిటీని చెప్పేందుకు చంద్రబోస్ తెలంగాణ, ఆంధ్ర జానపద, పల్లె పదాలను కలిపి వాడారు. పోలేరమ్మ, పోట్ల గిత్త, పోతరాజు, కిర్రు సెప్పులు, ఎర్రజొన్న రొట్టె, మిరప తొక్కు, విచ్చుకత్తి, కీసు పిట్ట, గడ్డపార, కాలు సిందు లాంటివి పాటలో చూడొచ్చు.

నాటు నాటు పాట లిరిక్స్ ఇవిగో..! 

పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు

నా పాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు..
నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు
పచ్చి మిరప లాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు
విచ్చు కత్తి లాగ వెర్రి నాటు
గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలా కీసు పిట్ట కూసినట్టు
ఏలు సిటికెలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా దుమారం రేగినట్టు
ఒల్లు సెమటపట్టేలా వీరంగం సేసినట్టు

నా పాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు..
నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు గడ్డపార లాగ చెడ్డ నాటు
నాటు నాటు నాటు నాటు నాటు ఉక్కపోత లాగ తిక్క నాటు
భూమి దద్దరిల్లేలా వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా
ఏసేయరో యకాయకి నాటు నాటు నాటో..
దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా
దుముకు దుముకులాడేలా దూకేయరో సరాసరి
నాటు నాటు నాటో

Read This : Naatu Naatu Song : థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.. 10టీవీతో రాహుల్ సిప్లిగంజ్..