పవర్ స్టార్ ఫస్ట్‌లుక్.. ఎన్నికల ఫలితాల తర్వాత..

వివాదాలకు కేరాఫ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తారు. ఇదివరకు థియేటర్‌లో సినిమాలు విడుదల చేసిన వర్మ, ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా ఓ యాప్‌లో సినిమాలను రిలీజ్ చేసుకుంటూ సొమ్ము చేస్తున్నాడు. ఆ యాప్‌కి ఆర్‌జీవి వరల్డ్ థియేటర్ అనే పేరు కూడా పెట్టాడు.
అంతే కాకుండా ఇప్పటికే ఆ యాప్‌లో కొద్దిరోజుల వ్యవధిలోనే మియా మాల్కోవాతో క్లైమాక్స్, శ్రీ రాపాకతో నగ్నం సినిమాలను తెరకెక్కించి విడుదల చేశాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఆయన ప్రకటించిన “పవర్ స్టార్” అనే సినిమాను కూడా అందులోనే విడుదల చేస్తునట్టు ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసాడు.
పోస్టర్ లో ఎన్నికల ఫలితాల తరవాత కథ అంటూ ఉండగా.. పోస్టర్‌లో నల్లని దుస్తులు ధరించి దిగులుగా ఉన్న వ్యక్తి కనిపిస్తున్నాడు. పవర్‌కి స్టార్‌కి మధ్యలో గాజు గ్లాస్‌ని కూడా పెట్టాడు. ఇవన్నీ చూస్తుంటే వర్మ మరోసారి. వివాదాల్లోకి రాబోతున్నట్లు అర్థం అయిపోతుంది.
ఆర్‌జీవీ వరల్డ్ యాప్‌లో ఒక్కో సినిమాకు ఒక్కో తలకు వంద నుండి రెండు వందల వరకు వసూలు చేస్తుండటంతో వర్మ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. దీనితో ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. వారానికి ఒక సినిమా చొప్పున తన థియేటర్‌లో విడుదలచేస్తూ పోతున్నాడు. ఇక మర్డర్, వైరస్, 12 ఓ క్లాక్ మరియు థ్రిల్లర్ అనే సినిమాలని త్వరలో రిలీజ్ చేయబోతున్నాడు.
Here is the first look poster of POWER STAR film soon to release in RGVWORLDTHEATRE #JaiPowerStar pic.twitter.com/YMbqXyRu2E
— Ram Gopal Varma (@RGVzoomin) July 9, 2020
Two brothers in a moment from my film POWER STAR pic.twitter.com/Q66pktqCah
— Ram Gopal Varma (@RGVzoomin) July 9, 2020
The actor playing the main character in POWER STAR is more POWERful than any STAR I saw pic.twitter.com/RuGlr7IkZJ
— Ram Gopal Varma (@RGVzoomin) July 9, 2020