Dulquer Salmaan : వంద కోట్ల కలెక్షన్ నా కల.. అది జరిగితే ఆయన ఫొటో ఫ్రేమ్ నా ఇంట్లో పెట్టుకుంటా.. స్టార్ హీరో వ్యాఖ్యలు..

మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం అన్ని భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. కానీ కలెక్షన్స్ విషయంలో..

Dulquer Salmaan : వంద కోట్ల కలెక్షన్ నా కల.. అది జరిగితే ఆయన ఫొటో ఫ్రేమ్ నా ఇంట్లో పెట్టుకుంటా.. స్టార్ హీరో వ్యాఖ్యలు..

Hero Dulquer Salmaan Interesting Comments on 100 Crores Collection

Updated On : October 29, 2024 / 9:44 AM IST

Dulquer Salmaan : ఇప్పుడు స్టార్ హీరోలందరికీ 100 కోట్ల కలెక్షన్ అనేది కామన్ అయిపోయింది. మీడియం రేంజ్ హీరోలు కూడా 100 కోట్ల గ్రాస్ సాధిస్తున్నారు. ఒక్క రోజులో 100 కోట్ల పైగా గ్రాస్ సాధించే స్టార్ హీరోలు కూడా ఉన్నారు. కానీ ఈ స్టార్ హీరో ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా, ఎన్ని హిట్స్ కొట్టినా ఇప్పటికి 100 కోట్ల గ్రాస్ సాధించలేకపోయారు.

మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం అన్ని భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం 100 కోట్లు ఇప్పటివరకు టచ్ చేయలేదు. దుల్కర్ కెరీర్ హైయెస్ట్ మన తెలుగులోనే తీసిన సీతారామం సినిమా. ఆ సినిమా ఆల్మోస్ట్ 96 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. జస్ట్ లో 100 కోట్లు మిస్ అయిపోయాయి. అయితే తాజాగా దుల్కర్ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : Ram Charan : చరణ్ RC16 లుక్ అదిరిందిగా.. ఏఎన్నార్ ఈవెంట్లో చరణ్ ఫోటోలు వైరల్.. బుచ్చిబాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా బ్యాంకింగ్ నేపథ్యంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ లక్కీ భాస్కర్ సినిమా మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేయొచ్చు అన్నారు.

దీనిపై హీరో దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ.. నాది 13 ఏళ్ళ కెరీర్. ఆల్మోస్ట్ 40 సినిమాలు చేశాను. వంద కోట్ల కలెక్షన్స్ అనేది నాకు కల. నిజంగా లక్కీ భాస్కర్ సినిమా మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేస్తే నాగవంశీ ఫొటో ఫ్రేమ్ చేయించి మా ఇంట్లో పెట్టుకుంటా. నా సినిమా వంద కోట్లు సాధిస్తే నా కంటే ఎక్కువ ఆనందించే వ్యక్తి ఈ భూమ్మీద ఉండరు అని అన్నారు. దీంతో దుల్కర్ వ్యాఖ్యలు వైరల్ అవుతాయి. మరి లక్కీ భాస్కర్ సినిమా మొదటి రోజు 100 కోట్లు సాధిస్తుందా, ఓవరాల్ గా అయినా 100 కోట్లు దాటి దుల్కర్ కెరీర్లో మొదటి 100 కోట్ల సినిమా అవుతుందా చూడాలి.