Manchu Manoj : ‘సాయంత్రం అన్నీ చెప్పేస్తా’.. కన్నీళ్లతో మరోసారి మీడియా ముందుకు మనోజ్..
హీరో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Hero Manchu Manoj was deeply emotional about manchu family dispute
Manchu Manoj : మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా మీడియా ముందుకు వచ్చిన మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. ‘నాన్న తరఫున జర్నలిస్టులకు క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నాకోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం చాలా బాధగా ఉంది. ఈ గొడవలో నా భార్య, కూతురి పేరు లాగుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని బంధువుల కాళ్లు కూడా పట్టుకుంటానని చెప్పాను. అయినా వినడం లేదు. ఈరోజు సాయంత్రం అన్నీ చెప్పేస్తా’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మనోజ్.
Also Read : Vishwak Sen : మాస్ కా దాస్ తో ‘జాతి రత్నాలు’ కాంబో.. మూవీ టైటిల్ ఫిక్స్
దీనికి గాను సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది. ఎలా జరిగింది. అన్న అన్ని విషయాలు చెప్పేస్తా అని చెప్పాడు మనోజ్. దీంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. గతకొంత కాలంగా మంచు ఫ్యామిలిలో గొడవలు జరుగుతున్న సంగతి తెల్సిందే. కానీ నిన్న రాత్రి నుండి ఈ గొడవలు తీవ్ర రూపం దాల్చాయి. మంగళవారం మంచు ఇంట హైడ్రామా నెలకొంది.
అయితే దీన్ని కవర్ చెయ్యడానికి వచ్చిన జర్నలిస్టు పై మోహన్ బాబు తీవ్ర స్థాయిలో ధూషించాడు. అసభ్య పదజాలం వాడుతూ.. మీడియా ప్రతినిధులపై చెయ్యి చేసుకున్నారు మోహన్ బాబు. మీడియాతో ఇలా ప్రవర్తించడంపై జర్నలిస్టు సంఘాలు ఆందోళన చెప్పట్టాయి. మోహన్ బాబు మీడియాకి క్షమాపణలు చెప్పాలని అంటున్నాయి.