Nani : నాని సినిమాకి సెన్సార్ కట్.. ‘హాయ్ నాన్న’ సినిమా నుంచి ఆ సీన్స్ తొలగింపు

నాని సినిమాలకు సెన్సారా కట్టా? ఎస్.. డిసెంబర్ 7 న రిలీజ్ కాబోతున్న 'హాయ్ నాన్న' సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని అభ్యంతరక అంశాలను తొలగించడం ఆసక్తికరంగా మారింది.

Nani : నాని సినిమాకి సెన్సార్ కట్.. ‘హాయ్ నాన్న’ సినిమా నుంచి ఆ సీన్స్ తొలగింపు

Nani

Nani : హీరో నాని డిసెంబర్ 7 న ‘హాయ్ నాన్న’ తో థియేటర్లలోకి రాబోతున్నారు. ఇప్పటిరవకు నాని ఫ్యామిలీ సినిమాలే చేస్తారని.. తన సినిమాలో రొమాన్స్‌కి చోటుండదు అనుకున్నారంతా. ‘హాయ్ నాన్న’ సినిమా చూసిన సెన్సార్ బోర్డు కొన్ని సీన్స్ కట్ చేయడం ఆసక్తి రేపుతోంది.

నేచురల్ స్టార్ నానికి ఫ్యామిలీ హీరోగా ముద్ర ఉంది. లవ్, సెంటిమెంట్‌ను బాగా పండించే ఈ నటుడు ఈ మధ్య రూటు మార్చారు. దసరా సినిమాతో మాస్ సినిమాలు కూడా చేయగలనని నిరూపించారు. ఇంకాస్త డోసు పెంచి రొమాన్స్‌కి కూడా తన సినిమాలో చోటిచ్చారు. ఈ సినిమా ట్రైలర్‌ చూసినవారికి నాని, మృణాల్ మధ్య రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని అర్ధమవుతుంది. డిసెంబర్ 7 న రిలీజ్ కాబోతున్న ‘హాయ్ నాన్న’ లో సరికొత్త నానిని చూడబోతున్నట్లుగా అనిపిస్తోంది. ఇకపై నానిని బోల్డ్ సీన్స్‌లో చూడబోతున్నామన్నమాట. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాపై జనాల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

Also Read: అప్పుడు ‘బాలిక వధూ’.. ఇప్పుడు ‘వధువు’.. చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ కొత్త సిరీస్.. ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

‘హాయ్ నాన్న’ సినిమాకి రీసెంట్‌గా సెన్సార్ పూర్తైంది. ఎవరూ ఊహించని విధంగా నాని సినిమాకి సెన్సార్ కట్ పడింది. ఈ సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న రెండు పదాలతో పాటు మృణాల్ ఠాకూర్‌కి సంబంధించిన బ్యాక్ షాట్స్ తొలగించారు. సినిమా వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు క్లీన్ యూ(U) సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా నిడివి 155 నిముషాలు.. అంటే 2 గంటల 35 నిముషాల ఉండబోతోంది.  శృతిహాసన్ ప్రత్యేక పాటలో నటిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, కియాకా ఖన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read : ప్రభాస్ సలార్ సినిమా.. ఆ సినిమా కథ ఒకటేనా? ముందునుంచి అనుకున్నదే అయిందా?

Nani

Nani