కరోనా మా పెళ్లిని ఆపలేదు: యంగ్ హీరో

కరోనా ప్రభావంతో ఇప్పటికే సినిమాలు ఆగిపోయాయి.. షాపింగ్‌లు నిలచిపోయాయి.. స్కూళ్లు బందయ్యాయి. ఈ క్రమంలో పెద్ద పెద్ద వేడుకలు కూడా రద్దయ్యే అవకాశం ఉందంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కరోనా కారణంగా తన పెళ్లి వాయిదా పడిందంటూ వచ్చిన వార్తలపై స్పందించారు హీరో నిఖిల్ సిద్ధార్ధ.
See Also | కరోనా మరణాల అప్‌డేట్: చైనా కంటే ఇతర దేశాల్లోనే!
ఇటీవల అర్జున్ సూరవరం సినిమాతో మంచి హిట్ అందుకుని హుషారుగా ఉన్న నిఖిల్.. గత కొద్దికాలం ప్రేమలో ఉన్న డాక్టర్ పల్లవిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో కరోనా భయాలు చోటుచేసుకోవడంపై నిఖిల్ స్పందిస్తూ.. ‘ఏప్రిల్‌లో పరిస్థితి ఎలా ఉన్నా.. నా పెళ్లి వాయిదా పడే ప్రసక్తి లేదు. ఇప్పటికే కన్వెన్షన్ హాల్‌ను అడ్వాన్స్‌గా బుక్ చేసుకొన్నాం. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఆహ్వాన పత్రికలు కూడా బంధువులకు పంపిస్తున్నాను. ఇక ఏది వచ్చినా పెళ్లి మాత్రం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అయితే వచ్చేవారానికల్లా పరిస్థితులు మెరుగుపడుతాయనే ఆశాభావంతో ఉన్నాం’ అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు.
నిఖిల్ డాక్టర్ పల్లవిని ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోబోతున్నారు.