Actor Nithin : హీరో నితిన్‌కు ప్రమాదం? షూటింగ్ నుండి బ్రేక్.. అసలేం జరిగింది?
హీరో నితిన్ షూటింగ్‌లో గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ నుండి విరామం తీసుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే అసలు ఏం జరిగింది?

Actor Nithin
Actor Nithin : వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న హీరో నితిన్ షూటింగ్‌లో గాయపడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుండగా నితిన్ చేతికి గాయం అయ్యిందని షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే అసలు ఏం జరిగింది?
Guntur Kaaram : గుంటూరు కారం మేకింగ్ వీడియో.. మహేష్ మాస్ జాతర మామూలుగా లేదు
జయం, దిల్ సినిమాలతో అందరి దిల్ దోచుకుని ఆపకుండా సినిమాలు చేస్తున్న నితిన్‌ను కొంతకాలంగా వరుస ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెడుతున్నాయి. భీష్మ సినిమా ఫర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం రీసెంట్ రిలీజ్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలు నిరాశని మిగిల్చాయి. ఇదిలా ఉంటే హీరో నితిన్‌కు షూటింగ్‌లో గాయాలయ్యాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చేతికి గాయం కావడంతో షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న’తమ్ముడు’ సినిమా షూటింగ్‌లో నితిన్ పాల్గొన్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లో నటిస్తున్న సమయంలో నితిన్ చేతికి గాయాలయ్యాయని అంటున్నారు. వైద్యులు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించడంతో నితిన్ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం.
Shraddha Das : బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్, పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటి
అయితే.. ఈ వార్తలన్నీ నిజం కాదనే మరో వార్త కూడా వినిపిస్తోంది. నితిన్ కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నారని అందుకోసమే వైద్యులు విశ్రాంతి తీసుకోమని సూచించారని కొందరు అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. కాగా నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సప్తమీ గౌడ హీరోయిన్ కాగా.. వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో నటిస్తున్నారు.