Guntur Kaaram : గుంటూరు కారం మేకింగ్ వీడియో.. మహేష్ మాస్ జాతర మామూలుగా లేదు

గుంటూరు కారం జనవరి 12 న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. సినిమాపై మరింత హైప్ పెంచేందుకు మేకర్స్ మేకింగ్ వీడియో వదిలారు.

Guntur Kaaram : గుంటూరు కారం మేకింగ్ వీడియో.. మహేష్ మాస్ జాతర మామూలుగా లేదు

Guntur Kaaram

Updated On : January 11, 2024 / 11:27 AM IST

Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్న రోజు దగ్గరకు వచ్చేసింది. జనవరి 12 న గుంటూరు కారం గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. వరల్డ్ వైడ్ రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాకి మరింత హైప్ ఇచ్చేందుకు చిత్ర నిర్మాతలు సిద్ధమవుతున్నారు. గుంటూరు కారం రిలీజ్‌కి ఒకరోజు ముందు మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు.

Shraddha Das : బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్, పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటి

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ జనవరి 12 న థియేటర్లలలో దుమ్ము రేపబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్.. సాంగ్స్ సినిమా మీద అంచనాలను పెంచేసాయి. ఈ మూవీ నుంచి రిలీజైన ‘కుర్చీ మడతపెట్టి ’ సాంగ్ కి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ చూసినా ఈ పాటే మోత మోగిపోతోంది. రీసెంట్ గా గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మంచి ఆదరణ లభించింది. మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ‘గుంటూరు కారం’ సినిమాకి మరింత హైప్ పెంచేందుకు సినిమా టీమ్ ‘గుంటూరు కారం’ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. వీడియో చూసిన అభిమానులు సంబరపడిపోతున్నారు. ఫైటింగ్ సీన్స్‌ చిత్రీకరణలో మహేష్ కొత్త లుక్‌లో కనిపించారు. మాస్ ప్రేక్షకులకు మరింత నచ్చేలా ఉంది మహేష్ కొత్త అవతారం. ఈ మేకింగ్ వీడియో చూస్తే మహేష్ ఆట,పాట మామూలుగా ఉండదనిపిస్తోంది.

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ నుంచి మరో సాంగ్ రిలీజ్.. ‘మావా ఎంతైనా..’ విన్నారా?

ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా శ్రీలీల నటిస్తుంటే మీనాక్షి చౌదరి ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబులు కీలక పాత్రలను పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.