కరోనాను జయించిన హీరో రాజశేఖర్

  • Published By: bheemraj ,Published On : November 9, 2020 / 09:43 PM IST
కరోనాను జయించిన హీరో రాజశేఖర్

Updated On : November 9, 2020 / 9:55 PM IST

rajasekhar recovered corona : కరోనా బారిన పడిన నటుడు రాజశేఖర్ కోలుకున్నారు. 20 రోజులకు పైగా కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఆయన సోమవారం (నవంబర్ 9, 2020) డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబర్ 23న కరోనా సోకడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు.



అప్పటినుంచి ఆయనకు చికత్స కొనసాగిస్తున్నారు. కాగా ఇటీవల పరీక్షల్లో నెగెటివ్ రావడంతో వైద్యులు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు.
రాజశేఖర్ కోలుకోవాలంటూ నిత్యం ప్రార్థించిన అభిమానులకు జీవిత కృతజ్ఞతలు తెలిపారు.



మెదట్లో ఆయన ఆరోగ్యం చలా క్రిటికల్‌ స్టేజికి వెళ్లిందని జీవిత తెలిపారు. వైద్యులు తీవ్రంగా కృషి చేసి ఆయనను కాపాడరని అన్నారు. ఆయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకున్న అభిమానులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.