Heroine Nidhi Agarwal : 35 సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకున్న హీరోయిన్

Heroine Nidhi Agarwal : 35 సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకున్న హీరోయిన్

Nidhi Agarwal

Updated On : March 31, 2021 / 10:59 AM IST

Heroine Nidhi Agarwal undergone the covid test 35 times : కరోనా లాక్ డౌన్ ప్రక్రియ దశలవారీగా ఎత్తివేస్తూ సినిమా షూటింగ్ లకు కూడా అనుమతిస్తూ వచ్చారు. షూటింగ్ ల్లో పాల్గోనే వారంతా తప్పని సరిగా కోవిడ్ టెస్ట్ లు చేయించుకోవటం మొదలెట్టారు. వారిలో హీరోయిన్ నిధి అగర్వాల్ ఒకరు.

గతేడాది అక్టోబరు నుంచి ఆమె షూటింగ్స్ లో పాల్గోంటున్నారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల కోసం ఆర్నెల్లుగా చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ల మధ్య ప్రయాణిస్తూ…షూటింగ్స్ లో పాల్గోంటూ బిజీగా ఉంటున్నారు.

ఇందుకోసం జర్నీ చేసిన ప్రతి సారీ కోవిడ్ టెస్ట్ చేయించుకుంటున్నారు. ఇప్పటికీ దాదాపు 35 సార్లుకోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని..మొదట్లో కాస్త అసౌకర్యంగా అనిపించినా ఇప్పుడు అలవాటు పడిపోయానని ఆమె చెప్పారు.